Telugu Global
NEWS

తుపానులు రాకుండా సముద్రానికి గోడ కడతామంటున్న ఏపీ మంత్రి

టెక్నాలజీతో ప్రకృతిని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించగా… మంత్రి పితాని మరో అడుగు ముందుకేశారు. పెథాయ్‌ తుపాను ప్రాంతంలో పర్యటించిన మంత్రులు పితాని సత్య నారాయణ… అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పారు. అంతటితో మంత్రి పితాని ఆగలేదు. భవిష్యత్తులో ఎంతటి తుపాను వచ్చినా తట్టుకునేలా సముద్రం వెంబడి గోడ నిర్మిస్తామని చెప్పారు. ”తుపానులు, వాయుగుండాల కారణంగా తీరప్రాంత ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా […]

తుపానులు రాకుండా  సముద్రానికి గోడ కడతామంటున్న  ఏపీ మంత్రి
X

టెక్నాలజీతో ప్రకృతిని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించగా… మంత్రి పితాని మరో అడుగు ముందుకేశారు. పెథాయ్‌ తుపాను ప్రాంతంలో పర్యటించిన మంత్రులు పితాని సత్య నారాయణ… అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పారు.

అంతటితో మంత్రి పితాని ఆగలేదు. భవిష్యత్తులో ఎంతటి తుపాను వచ్చినా తట్టుకునేలా సముద్రం వెంబడి గోడ నిర్మిస్తామని చెప్పారు.

”తుపానులు, వాయుగుండాల కారణంగా తీరప్రాంత ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో సముద్ర తీరాన డ్రిజ్జింగ్‌ చేయాలని యోచిస్తున్నాం. ఈ పనులు జరిగితే తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో ఎంతటి తుపాన్లు వచ్చినా ప్రజలు ఆందోళన చెందనవసరం లేదు. సముద్రం కోతను పూర్తిగా నివారించవచ్చు” అని మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

First Published:  19 Dec 2018 2:12 PM IST
Next Story