Telugu Global
Cinema & Entertainment

చెప్పను బ్రదర్.... మళ్లీ స్టార్ట్ చేసిన బన్నీ

చెప్పను బ్రదర్ అనగానే ఎవరికైనా అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ఈ హీరో అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ పేరు ప్రస్తావించకుండా కొన్నాళ్ల పాటు పవన్ ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యాడు ఈ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఇంకోసారి చెప్పను బ్రదర్ అంటున్నాడు బన్నీ. కాకపోతే ఈసారి ఎలాంటి వివాదాల్లేవ్. అంతా సరదాగానే సాగిపోయింది. పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన అల్లు అర్జున్.. సాయిపల్లవిని ఆకాశానికెత్తేశాడు. ఆమె యాక్టింగ్ కు […]

చెప్పను బ్రదర్.... మళ్లీ స్టార్ట్ చేసిన బన్నీ
X

చెప్పను బ్రదర్ అనగానే ఎవరికైనా అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ఈ హీరో అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ పేరు ప్రస్తావించకుండా కొన్నాళ్ల పాటు పవన్ ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యాడు ఈ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఇంకోసారి చెప్పను బ్రదర్ అంటున్నాడు బన్నీ. కాకపోతే ఈసారి ఎలాంటి వివాదాల్లేవ్. అంతా సరదాగానే సాగిపోయింది.

పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన అల్లు అర్జున్.. సాయిపల్లవిని ఆకాశానికెత్తేశాడు. ఆమె యాక్టింగ్ కు ఫిదా అన్నాడు. తెలుగులో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా.. స్టార్ హీరోల్లో కూడా సాయిపల్లవికి ఫ్యాన్స్ ఉన్నారన్నాడు. ఓ స్టార్ హీరోకు సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని, ఆ హీరో ఎవరో చెప్పను బ్రదర్ అన్నాడు.

మరోవైపు హీరో శర్వానంద్ పై కూడా ఇలాంటిదే ఫీలర్ వదిలాడు. శర్వా కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ డైరక్టర్ అతడ్ని విమర్శించాడని, కేవలం ఒకే జానర్ లో సినిమాలు చేస్తున్నాడని, కామెడీ చేయలేడని ఆ డైరక్టర్ అన్నాడట. తర్వాత అదే డైరక్టర్ రన్ రాజా రన్ చూసి తన తప్పు తెలుసుకున్నాడట. ఆ స్టార్ డైరక్టర్ ఎవరో తను చెప్పను బ్రదర్ అంటున్నాడు బన్నీ.

First Published:  19 Dec 2018 5:07 AM IST
Next Story