Telugu Global
NEWS

హైదరాబాద్‌ వాహనదారులకు గుడ్‌ న్యూస్‌....

హైదరాబాద్‌లో వాహనదారులకు గుడ్‌ న్యూస్‌. హఠాత్తుగా వాహనంలో పెట్రోల్, లేదా డీజిల్ అయిపోతే మరీ ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. సమీపంలోనే మీకు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా హైదరాబాద్‌లో 600 పెట్రోల్ బంకులకు అనుమతి రావడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఆరు వందల పెట్రోల్ బంకులున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొత్తగా మరో 600 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. తెలంగాణలోనూ ఇతర ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకులు ఏర్పాటు […]

హైదరాబాద్‌ వాహనదారులకు గుడ్‌ న్యూస్‌....
X

హైదరాబాద్‌లో వాహనదారులకు గుడ్‌ న్యూస్‌. హఠాత్తుగా వాహనంలో పెట్రోల్, లేదా డీజిల్ అయిపోతే మరీ ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. సమీపంలోనే మీకు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి.

కొత్తగా హైదరాబాద్‌లో 600 పెట్రోల్ బంకులకు అనుమతి రావడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఆరు వందల పెట్రోల్ బంకులున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొత్తగా మరో 600 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.

తెలంగాణలోనూ ఇతర ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారు… డిసెంబర్ 25 వరకు 10 వేల ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్‌లో ఒకేసారి పెట్రోల్ బంకులు డబుల్ అవుతుండడం ఇప్పటికే పెట్రోల్ బంకులు నడుపుతున్న వారికి ఆందోళన కలిగిస్తోంది.

పెట్రోల్ బంకుల సంఖ్య డబుల్ అయితే… తమ బంకుల్లో సేల్స్‌ భారీగా పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే అందుబాటులోకి మరిన్ని పెట్రోల్ బంకులు రావడం మాత్రం వినియోగదారులకు సౌకర్యవంతమైనదిగానే భావిస్తున్నారు.

First Published:  19 Dec 2018 6:14 AM IST
Next Story