వాగులో చిక్కుకున్న ట్రాక్టర్.... ఆ తర్వాత ఏం జరిగిందంటే....
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాక్టర్ వాగులో చిక్కుకుంది. ఇల్లంతకుంట మండలం పొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. వాగులో ఇసుక తీసుకొచ్చేందుకు కూలీలు రెండు ట్రాక్టర్లలో వెళ్లారు. ఇంతలో హఠాత్తుగా మిడ్ మానేరు రిజర్యాయర్ గేట్లు ఎత్తారు అధికారులు. దీంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. నీరు దూసుకొస్తున్న విషయం గమనించిన ఒక ట్రాక్టర్‌లోని వారు వెంటనే గట్టుకు వెళ్లిపోయారు. మరో ట్రాక్టర్ గట్టుకు చేరకముందే నీటిలో చిక్కుకు పోయింది. ట్రాక్టర్ ట్రాలీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాక్టర్ వాగులో చిక్కుకుంది. ఇల్లంతకుంట మండలం పొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. వాగులో ఇసుక తీసుకొచ్చేందుకు కూలీలు రెండు ట్రాక్టర్లలో వెళ్లారు.
ఇంతలో హఠాత్తుగా మిడ్ మానేరు రిజర్యాయర్ గేట్లు ఎత్తారు అధికారులు. దీంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. నీరు దూసుకొస్తున్న విషయం గమనించిన ఒక ట్రాక్టర్‌లోని వారు వెంటనే గట్టుకు వెళ్లిపోయారు.
మరో ట్రాక్టర్ గట్టుకు చేరకముందే నీటిలో చిక్కుకు పోయింది. ట్రాక్టర్ ట్రాలీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాదాపు ఎనిమిది మంది నీటిలో చిక్కుకుపోయారు.
వెంటనే అక్కడున్న వారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతి కష్టం మీద వారిని రక్షించారు. ట్రాక్టర్ వాగులోని నీటిలో మునిగిపోయింది. అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీటిని విడుదల చేశారని అందుకే తాము నీటిలో చిక్కుకుపోయామని బాధితులు చెబుతున్నారు.