సూరి హత్య కేసులో దోషి మన్మోహన్ విడుదల
మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్, అతడి వ్యక్తిగత గన్‌మెన్ మన్మోహన్‌ను దోషులుగా తేలుస్తూ నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కుంచాల సునీత తీర్పు చెప్పారు. తీర్పుతో భాను కిరణ్ కంగుతిన్నాడు. తనకు యావజ్జీవ శిక్ష పడడంతో కలత చెందాడట. భానుతో పాటు అతడి వ్యక్తిగత అంగరక్షకుడు మన్మోహన్‌ను దోషిగా కోర్టు తేల్చింది. అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిషేధిత ఆయుధ చట్టం కింద మన్మోహన్‌కు ఐదేళ్ల జైలు విధించింది […]
మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్, అతడి వ్యక్తిగత గన్‌మెన్ మన్మోహన్‌ను దోషులుగా తేలుస్తూ నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కుంచాల సునీత తీర్పు చెప్పారు. తీర్పుతో భాను కిరణ్ కంగుతిన్నాడు. తనకు యావజ్జీవ శిక్ష పడడంతో కలత చెందాడట.
భానుతో పాటు అతడి వ్యక్తిగత అంగరక్షకుడు మన్మోహన్‌ను దోషిగా కోర్టు తేల్చింది. అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిషేధిత ఆయుధ చట్టం కింద మన్మోహన్‌కు ఐదేళ్ల జైలు విధించింది కోర్టు. దీంతో యావజ్జీవ ఖైదు పడ్డ భాను కిరణ్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు.
ఆరున్నరేళ్లుగా భానుకిరణ్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఐదేళ్ల శిక్ష పడిన మన్మోహన్ మాత్రం రాత్రే విడుదలయ్యాడు.
అతడు ఇప్పటికే ఎనిమిదేళ్లుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నాడు. శిక్షా కాలం కంటే ఎక్కువ సమయం జైల్లో ఉన్న మన్మోహన్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చేశాడు.