ముకేష్ అంబానీని కడిగేసిన గవర్నర్
వందల కోట్లు ఖర్చు పెట్టి ముకేష్ అంబానీ తన కుమార్తెకు పెళ్లి చేస్తే పాజిటివ్ కథనాలతో మీడియా ఆకాశానికెత్తింది. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి…. ఈ దేశంలో పేదరికంతో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నా వారి కోసం ఎందుకు సాయం చేయరు అని మాత్రం అంబానీని ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించరు. ఇదే అంశంపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం తీవ్రంగా స్పందించారు. ముకేష్ అంబానీని కడిగేశారు. దేశంలో అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తి […]
వందల కోట్లు ఖర్చు పెట్టి ముకేష్ అంబానీ తన కుమార్తెకు పెళ్లి చేస్తే పాజిటివ్ కథనాలతో మీడియా ఆకాశానికెత్తింది. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి…. ఈ దేశంలో పేదరికంతో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నా వారి కోసం ఎందుకు సాయం చేయరు అని మాత్రం అంబానీని ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించరు.
ఇదే అంశంపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం తీవ్రంగా స్పందించారు. ముకేష్ అంబానీని కడిగేశారు. దేశంలో అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని… కానీ అతడికి పేదలకోసం దాతృత్వ విరాళాలు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావు అని విమర్శించారు.
అంబానీ పేరు నేరుగా ప్రస్తావించకుండానే… దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి తన కుమార్తె వివాహానికి పెట్టిన ఖర్చును జమ్ముకశ్మీర్‌లో వాడితే 700 పాఠశాలలు నిర్మించవచ్చన్నారు. కనీసం ఏడు వేల మంది అమర జవాన్ల పిల్లల్ని పోషించేందుకు ఆ సొమ్ము సరిపోతుందన్నారు.
దేశంలో ఇలాంటి ధనవంతులు రోజురోజుకూ సంపద పెంచుకుంటూ… పేదలకు, సేవకు మాత్రం ఒక్క చిల్లిగవ్వ కూడా విదల్చకుండా కఠినాత్ములుగా మారిపోయారని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డారు.
గవర్నర్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇన్నాళ్లకు పైస్థాయి వ్యక్తి ఒకరు… అంబానీల ఐశ్యర్యాన్ని ప్రశ్నిస్తుండడం సంతోషంగా ఉందని నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.