Telugu Global
NEWS

"చంద్రబాబు వల్లే పెథాయ్‌ రెండుసార్లు తీరం తాకింది"

పెథాయ్‌ తుపాను గత తుపానులకు భిన్నంగా వ్యవహరించింది. రెండుసార్లు తీరం దాటింది. తొలుత నిన్న మధ్యాహ్నం యానాం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలహీన పడాల్సిన తుపాను… వెంటనే దిశ మార్చుకుని సముద్రంలోకి వెళ్లిపోయింది. తిరిగి రాత్రి తుని వద్ద మరోసారి తీరాన్ని దాటింది. ఇలా జరగడానికి చంద్రబాబు లెగ్గే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం తుపానులో చిక్కుకుని ఉండగా చంద్రబాబు మాత్రం మధ్యప్రదేశ్‌ సీఎం ప్రమాణస్వీకారానికి వెళ్లరని.. చంద్రబాబు లోకల్లో లేరన్న […]

చంద్రబాబు వల్లే పెథాయ్‌ రెండుసార్లు తీరం తాకింది
X

పెథాయ్‌ తుపాను గత తుపానులకు భిన్నంగా వ్యవహరించింది. రెండుసార్లు తీరం దాటింది. తొలుత నిన్న మధ్యాహ్నం యానాం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలహీన పడాల్సిన తుపాను… వెంటనే దిశ మార్చుకుని సముద్రంలోకి వెళ్లిపోయింది. తిరిగి రాత్రి తుని వద్ద మరోసారి తీరాన్ని దాటింది.

ఇలా జరగడానికి చంద్రబాబు లెగ్గే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం తుపానులో చిక్కుకుని ఉండగా చంద్రబాబు మాత్రం మధ్యప్రదేశ్‌ సీఎం ప్రమాణస్వీకారానికి వెళ్లరని.. చంద్రబాబు లోకల్లో లేరన్న విషయం తెలుసుకున్నాక తుపాను మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయిందన్నారు. శనిపుత్రుడు చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వచ్చారని తెలుసుకున్న తర్వాత రాత్రి మరోసారి తుపాను తీరాన్ని దాటిందన్నారు.

చంద్రబాబును ఏది అడిగినా డ్యాష్ బోర్డులో ఉందంటారని.. కానీ చంద్రబాబుకు కారు డ్యాష్ బోర్డు గురించి మాత్రమే తెలుసన్నారు. కంప్యూటర్‌ను అంతా సెట్‌ చేసి ముందు పెడితే స్క్రీన్‌ను స్క్రోల్ చేయడం తప్ప చంద్రబాబుకు ఏమీ తెలియదన్నారు. కనీసం కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం కూడా చంద్రబాబుకు రాదన్నారు.

చంద్రబాబు తన కంప్యూటర్ నాలెడ్జ్‌ను ప్రదర్శించేందుకు సిద్దమా అని విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. కంప్యూటర్‌లో ఏ కీ ఎందుకు వాడుతారో కూడా చంద్రబాబుకు తెలియదన్నారు. కంప్యూటర్ గురించి ఏమీ తెలియని చంద్రబాబు కంప్యూటర్ ను నేనే కనిపెట్టానన్న లెవల్ లో చెబుతాడన్నారు.

First Published:  18 Dec 2018 6:28 AM IST
Next Story