Telugu Global
NEWS

సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ ఖైదు

మద్దెల చెరువు సూరి హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడిగా ఉన్న భాను కిరణ్ ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. భాను కిరణ్ కు యావజ్జీవ ఖైదును విధించింది. 20వేల జరిమానా కూడా విధించింది. భానుకు యావజ్జీవ ఖైదు విధించిన కోర్టు మరో నిందితుడు మన్మోహన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. కేసులో నిందితులుగా ఉన్న సుబ్బయ్య, వెంకటరమణ, హరిబాబు, వంశీలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. 2011 జనవరి 3న సూరి హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు. […]

సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ ఖైదు
X

మద్దెల చెరువు సూరి హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడిగా ఉన్న భాను కిరణ్ ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. భాను కిరణ్ కు యావజ్జీవ ఖైదును విధించింది. 20వేల జరిమానా కూడా విధించింది.

భానుకు యావజ్జీవ ఖైదు విధించిన కోర్టు మరో నిందితుడు మన్మోహన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. కేసులో నిందితులుగా ఉన్న సుబ్బయ్య, వెంకటరమణ, హరిబాబు, వంశీలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది.

2011 జనవరి 3న సూరి హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు. సూరి వెంటే ఉన్న భాను కారు వెనుక సీట్లో నుంచి సూరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆస్పత్రికి తరలించగా సూరి చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతరం భాను పారిపోయారు. చాలా కాలం తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయింది.

First Published:  18 Dec 2018 7:44 AM IST
Next Story