Telugu Global
NEWS

ఒక రైతు పోరాటం... బజారులో తహసీల్దార్‌ పరువు

ఒక పేద రైతు గుండె మండింది. లంచం కోసం జలగలా వేధిస్తున్న తహసీల్దార్‌ కార్యాలయానికి బుద్ధి చెప్పేందుకు రోడ్డెక్కారు. కడుపు మండి రైతు చేపట్టిన నిరసనకు ప్రజా మద్దతు లభించింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు భూమి కబ్జాకు గురైంది. ఈ విషయంలో న్యాయం చేయాలని ఆరు నెలలుగా ఆ పేద రైతు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎవరూ తన ఘోష వినిపించుకోలేదు. చివరకు లంచం ఇస్తే […]

ఒక రైతు పోరాటం... బజారులో తహసీల్దార్‌ పరువు
X

ఒక పేద రైతు గుండె మండింది. లంచం కోసం జలగలా వేధిస్తున్న తహసీల్దార్‌ కార్యాలయానికి బుద్ధి చెప్పేందుకు రోడ్డెక్కారు. కడుపు మండి రైతు చేపట్టిన నిరసనకు ప్రజా మద్దతు లభించింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు భూమి కబ్జాకు గురైంది.

ఈ విషయంలో న్యాయం చేయాలని ఆరు నెలలుగా ఆ పేద రైతు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎవరూ తన ఘోష వినిపించుకోలేదు. చివరకు లంచం ఇస్తే పనిచేసి పెడుతామంటూ పేద రైతును రెవెన్యూ రాంబంధులు చుట్టుముట్టాయి.

లంచం ఇచ్చుకోలేని రైతు వెంకటేశ్వర్లు తన గోడును ప్రపంచానికి వినిపించాలనుకున్నారు. తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి వెలుగోడు పట్టణంలో నిరాహారదీక్షకు దిగారు. ”లంచం ఇవ్వాలి…. ధర్మం చేయండి” అంటూ ఫ్లెక్సీ పెట్టుకుని దీక్షకు దిగారు.

ఇంత జరిగినా తహసీల్దార్ శ్రీనివాసులు మాత్రం…. తామెవ్వరం రైతు వెంకటేశ్వర్లును లంచం అడగలేదని బుకాయిస్తున్నారు. తహసీల్దార్‌, రెవెన్యూ సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచం కోసం రాబంధుల్లా పీడించి ఉండకపోతే… రైతు వెంకటేశ్వర్లు భార్య, పిల్లలతో కలిసి ఎందుకు రోడ్డు మీద నిరహారదీక్షకు దిగుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ… ఐదు వేల ఆదాయం కూడా గ్యారెంటీ లేని రైతుల రక్తం తాగే అవినీతి జలగలను కఠినంగా శిక్షించాలని వెలుగోడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  18 Dec 2018 6:57 AM IST
Next Story