ఐపీఎల్ -12 వేలంలో ఉనద్కత్ కే మళ్లీ జాక్ పాట్
8 కోట్ల 50 లక్షల ధరకు రాజస్థాన్ రాయల్స్ కు దక్కిన ఉనద్కత్ బ్రాత్ వెయిట్, అక్షర్ పటేల్ లకు చెరో 5 కోట్ల జాక్ పాట్ షమీకి 4 కోట్ల 80 లక్షలు, విహారికి 2 కోట్ల వేలం ధర యువరాజ్, పూజారాలను పట్టించుకోని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 12వ సీజన్ వేలం…జైపూర్ వేదికగా…సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం…భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 […]

- 8 కోట్ల 50 లక్షల ధరకు రాజస్థాన్ రాయల్స్ కు దక్కిన ఉనద్కత్
- బ్రాత్ వెయిట్, అక్షర్ పటేల్ లకు చెరో 5 కోట్ల జాక్ పాట్
- షమీకి 4 కోట్ల 80 లక్షలు, విహారికి 2 కోట్ల వేలం ధర
- యువరాజ్, పూజారాలను పట్టించుకోని ఫ్రాంచైజీలు
ఐపీఎల్ 12వ సీజన్ వేలం…జైపూర్ వేదికగా…సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం…భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో… రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకొంది.
కోటీ 50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన ఉనద్కత్ వేలం చివరకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో ముగిసింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని… రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 4 కోట్ల 80 లక్షల రూపాయల ధరకు దక్కించుకొంది.


లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కోటీ 10 లక్షల ధరకే ఢిల్లీ జట్టులో చేరాడు.

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారిని…ఢిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.


వెస్టిండీస్ టీ-20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వెయిట్, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లకు సైతం…చెరో 5 కోట్ల రూపాయలు చొప్పున ధర పలికింది.

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పూజారాలను సొంతం చేసుకోడానికి… ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోడం విశేషం.
