Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ కోసం హను రాఘవాపుడి లవ్ స్టోరీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ లో అన్ని ప్రేమ కథలే చేసాడు, కానీ రాను రాను క్రేజ్ పెరగడంతో ప్రేమ కథలు తగ్గించి కమర్షియల్ కథలు మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కథలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి “ఆర్య” లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ కథ పడితే సినిమా సూపర్ హిట్. ఇప్పుడు అల్లు అర్జున్ మనసులో కూడా ఇదే ఉంది అందుకే డైరెక్టర్ హను రాఘవాపుడి […]

అల్లు అర్జున్ కోసం హను రాఘవాపుడి లవ్ స్టోరీ
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ లో అన్ని ప్రేమ కథలే చేసాడు, కానీ రాను రాను క్రేజ్ పెరగడంతో ప్రేమ కథలు తగ్గించి కమర్షియల్ కథలు మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కథలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి “ఆర్య” లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ కథ పడితే సినిమా సూపర్ హిట్. ఇప్పుడు అల్లు అర్జున్ మనసులో కూడా ఇదే ఉంది అందుకే డైరెక్టర్ హను రాఘవాపుడి ని తన కోసం ఒక మంచి కథ రెడీ చేసుకొని రమ్మని చెప్పాడు.

అల్లు అర్జున్ ఇటీవలే శర్వానంద్ హీరోగా వచ్చిన “పడి పడి లేచే మనసు” సినిమా ఆడియో రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు, అయితే ఇక్కడ ఆలు అర్జున్ హను రాఘవాపుడి గురించి మాట్లాడుతూ మాటల మధ్యలో “హను నాకోసం ఒక మంచి లవ్ స్టొరీ రెడీ చెయ్” అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే హను ఒక మంచి లవ్ స్టొరీ రాస్తే అల్లు అరుణ్ దర్శకత్వం అవకాశం ఇచ్చేస్తాడు అనమాట. మరి “పడి పడి లేచే మనసు” రిలీజ్ అయ్యాక దాని హిట్ బట్టి హను తన తదుపరి సినిమా పై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

First Published:  18 Dec 2018 7:47 AM IST
Next Story