మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని... నడిరోడ్డుపైనే కారు
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయాడు. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే స్టిక్కర్ లేకుండానే చింతమనేని రోడ్డు మీదకు వచ్చాడు. టోల్‌ప్లాజా వద్ద టోల్ కట్టాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో చింతమనేనికి కోపం వచ్చేసింది. తననే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. కారుకు నెంబర్ ప్లేట్ లేదు… ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదని… అందుకే తాము ఆపామని సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. […]
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయాడు. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే స్టిక్కర్ లేకుండానే చింతమనేని రోడ్డు మీదకు వచ్చాడు.
టోల్‌ప్లాజా వద్ద టోల్ కట్టాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో చింతమనేనికి కోపం వచ్చేసింది. తననే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు.
కారుకు నెంబర్ ప్లేట్ లేదు… ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదని… అందుకే తాము ఆపామని సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. కానీ చింతమనేని తగ్గలేదు. సిబ్బందిని కొట్టినంత పనిచేశాడు.
కారును ఇక్కడే పెట్టుకోండి… మీ సంగతి చూస్తా అంటూ రోడ్డు మీదే అడ్డంగా కారును వదిలేసి అటుగా వస్తున్న బస్సు ఎక్కేసి చింతమనేని వెళ్లిపోయాడు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద ఈ ఘటన జరిగింది.