Telugu Global
NEWS

రాష్ట్రానికి శుభవార్త.... ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం!

తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1028కోట్ల రూపాయలతో నల్లగొండ జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రిలో వంద ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉండనున్నాయి. 750 పడకలతో 15 విభాగాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. తెలంగాణతోపాటు తమిళనాడులోని మధురైలోనూ 1,264 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇక ఎయిమ్స్ […]

రాష్ట్రానికి శుభవార్త.... ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం!
X

తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1028కోట్ల రూపాయలతో నల్లగొండ జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఆసుపత్రిలో వంద ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉండనున్నాయి. 750 పడకలతో 15 విభాగాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. తెలంగాణతోపాటు తమిళనాడులోని మధురైలోనూ 1,264 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

ఇక ఎయిమ్స్ లో రోజూ 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఎయిమ్స్ లో ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీల కృషి మేరకు ఇటీవలే రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

First Published:  17 Dec 2018 9:47 PM GMT
Next Story