Telugu Global
NEWS

ఆపరేషన్‌ గరుడ శివాజీ పరుగో పరుగు.... మీడియాకు వార్నింగ్

ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి రేపిన నటుడు శివాజీ కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. స్థానికంగా అపార్ట్‌మెంట్ లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆయన వచ్చారు. గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు హఠాత్తుగా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది… గరుడ శివాజీ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో శివాజీకి కోపం వచ్చింది. మీడియా సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిట్టారు. ఫోటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. ”రాస్తే రాసుకోండి. మహా […]

ఆపరేషన్‌ గరుడ శివాజీ పరుగో పరుగు.... మీడియాకు వార్నింగ్
X

ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి రేపిన నటుడు శివాజీ కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. స్థానికంగా అపార్ట్‌మెంట్ లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆయన వచ్చారు.

గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు హఠాత్తుగా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది… గరుడ శివాజీ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో శివాజీకి కోపం వచ్చింది.

మీడియా సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిట్టారు. ఫోటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. ”రాస్తే రాసుకోండి. మహా అయితే ఏం రాస్తారు?. చంద్రబాబు ఇచ్చిన డబ్బుతో శివాజీ ఆస్తులు కొన్నారని రాస్తారు అంతేగా… రాసుకోండి” అంటూ రుసరుసలాడారు.

రిజిస్ట్రేషన్‌ను వేగంగా పూర్తి చేయించుకున్న శివాజీ… వెంటనే ఏ మాత్రం ఆగకుండా కారెక్కి వెళ్లిపోయారు. శివాజీ వెంట వచ్చిన వ్యక్తులు… మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు.

ఫోటోలు తీసిన వారి ఫోన్లు లాక్కుని వాటి నుంచి ఫోటోలను, వీడియోలను డిలిట్ చేశారు. గన్నవరం సమీపంలో ఒకప్రముఖ రియల్ ఎస్టేట్‌ కంపెనీకి చెందిన అపార్టుమెంట్‌లో రెండు ప్లాట్లను శివాజీ కొనుగోలు చేశారు.

First Published:  18 Dec 2018 4:49 AM IST
Next Story