Telugu Global
National

అంతా బాత్రూమే చేసిందంటున్న బీజేపీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒంటరిగా 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై బీజేపీకి ఓ అనూహ్యమైన క్లారిటీ వచ్చింది. సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు ఏం చెబుతుంటాయి….. ప్రజలు సరిగ్గా ఆదరించలేదనో…. డబ్బులు బాగా పంచారనో… రిగ్గింగ్ జరిగిందనో…. ప్రచారం సరిగ్గా చేయలేదనో…. బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదనో సాకులు చెబుతుంటాయి. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. ఓటమికి […]

అంతా బాత్రూమే చేసిందంటున్న బీజేపీ!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒంటరిగా 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై బీజేపీకి ఓ అనూహ్యమైన క్లారిటీ వచ్చింది.

సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు ఏం చెబుతుంటాయి….. ప్రజలు సరిగ్గా ఆదరించలేదనో…. డబ్బులు బాగా పంచారనో… రిగ్గింగ్ జరిగిందనో…. ప్రచారం సరిగ్గా చేయలేదనో…. బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదనో సాకులు చెబుతుంటాయి. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది.

ఓటమికి వాస్తుదోషమే కారణం అంటున్నారు ఆ పార్టీ నేతలు. అది కూడా బాత్రూంల వాస్తుదోషం అట. బాత్రూంలే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాయని సమీక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు అభిప్రాయానికి వచ్చారట. బాత్రూంలు…. ఓడించడమా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది.

గత ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన బీజేపీ….ఇప్పుడు ఒక్క స్థానంలో గెలిచి హోర పరాజయాన్ని మూటగట్టుకుంది. స్వామి పరిపూర్ణానందను రంగంలోకి దింపినా….బీజేపీకి ఎక్కడా కలిసొచ్చినట్లు కనపడలేదు. దీంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనుకున్న నాయకులకు తీవ్ర నిరాశే మిగిలింది.

ప్రధాని మోడీ తో సహా పలువురు కేంద్రమంత్రులు-బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా…బీజేపీని గట్టెక్కించలేకపోయారు. కేవలం ఒక్కసీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. 118 స్ధానాల్లో పోటీచేసిన ప్రముఖ నాయకులంతా చిత్తుగా ఓడిపోయారు. ఇక 100 స్థానాల్లో అయితే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజాసింగ్…ఒక్కరే అసెంబ్లీలో ఉండనున్నారు. రాజాసింగే తన ప్రత్యర్థిపై 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇదిలా ఉంటే…ఈ పరాజయానికి బీజేపీ నేతలు ఓ సరికొత్త కారణం చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఈమధ్యే ఆధునీకరించారు. టెర్రస్ పైన బాత్రూంలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ బాత్రూంలే బీజేపీ పాలిట శాపంగా మారాయంటున్నారు నేతలు. అందువల్లే నలుగురు సిట్టింగ్ అభ్యర్థులు ఓడిపోయారని చెబుతున్నారు.

మొత్తానికి బీజేపీ కొంపను బాత్రూంలే కూల్చాయన్నది ఆ పార్టీ నేతల వాదన. ఇంతటితో ఆగుతుందా లేక ఈ వాస్తు దోషం జాతీయ నేతలపైనా ప్రభావం చూపుతుందా చూడాల్సిందే.

అయితే గతంలో కూడా ఢిల్లీ బీజేపీ పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీసుకు మారినప్పుడు కూడా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఆఫీస్ మారడమే మన ఓటమి కారణమని అప్పుడు అలా తేల్చారు. ఇప్పుడు ఇలా తేలుస్తున్నారు.

First Published:  16 Dec 2018 8:40 PM GMT
Next Story