ట్రాన్స్ జెండర్లు బాధపడరా? రేవంత్ రెడ్డి మనకు అవసరమా?
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన నటుడు ప్రకాశ్ రాజ్… టీఆర్‌ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల సమయంలో నిర్మాత బండ్ల గణేష్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్‌ను జనం కామెడీగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వింతలు, విశేషాలు జరుగుతుంటాయన్నారు. కొందరు బండ్ల గణేష్‌లాగా మాట్లాడుతుంటారని… జనం […]
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన నటుడు ప్రకాశ్ రాజ్… టీఆర్‌ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల సమయంలో నిర్మాత బండ్ల గణేష్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్‌ను జనం కామెడీగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వింతలు, విశేషాలు జరుగుతుంటాయన్నారు. కొందరు బండ్ల గణేష్‌లాగా మాట్లాడుతుంటారని… జనం అలాంటి వారి వీడియోలను ఎక్కువగా చూస్తారన్నారు. కాకపోతే బండ్ల గణేష్ లాంటి వారిని కామెడీగా చూసిన ప్రజలు … ఫైనల్‌గా ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో డిసైడ్ చేశారన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు ప్రకాశ్ రాజ్. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఏంటని మండిపడ్డారు. అటు ఇటు కాని వాళ్లు టీఆర్‌ఎస్‌కు ఓటేయండని రేవంత్ రెడ్డి చెప్పారని ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.
అలా అనడం ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీని కించపరడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా అని వ్యాఖ్యానించారు. తాను పలానా పార్టీకి ఓటేయాల్సిందిగా చెప్పలేదని… ఆలోచించి రాష్ట్రం కోసం నిలబడే వారికి ఓటేయాలని మాత్రమే కోరానని ప్రకాశ్ రాజ్ చెప్పారు.