దుమారం రేపుతున్న సీఎం పారికర్ ఫొటోలు
గోవా సీఎం మనోహర్ పారికర్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్న పారికర్ అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే అనారోగ్యంపాలై తిరిగి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన నెలల తరబడి అనారోగ్యంతో ఉన్నా సరే సీఎం పదవిని మాత్రం వదులుకోలేదు. బీజేపీ కూడా మరొకరిని నియమించే ఆలోచన చేయలేదు. ఇంతలో అనారోగ్యంతోనే ఉన్నా… పారికర్ పణాజీలో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. పారికర్ సాధారణంగా వచ్చి ఉంటే చర్చ ఉండేది కాదు. […]
గోవా సీఎం మనోహర్ పారికర్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్న పారికర్ అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే అనారోగ్యంపాలై తిరిగి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన నెలల తరబడి అనారోగ్యంతో ఉన్నా సరే సీఎం పదవిని మాత్రం వదులుకోలేదు. బీజేపీ కూడా మరొకరిని నియమించే ఆలోచన చేయలేదు.
ఇంతలో అనారోగ్యంతోనే ఉన్నా… పారికర్ పణాజీలో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. పారికర్ సాధారణంగా వచ్చి ఉంటే చర్చ ఉండేది కాదు. కానీ పారికర్ తన ముక్కులో ట్యూబ్‌ను అలాగే ఉంచుకుని పర్యటనకు వచ్చారు. బక్క పలుచగా మారిపోయిన సీఎం…. సిబ్బంది సాయంతో వంతెనను పరిశీలించారు. ఇప్పుడు ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
పారికర్ ఈ స్థితిలో కూడా పర్యటనలు చేయడం ఆయన నిబద్దతకు, అంకిత భావానికి నిదర్శనమని బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నేత ప్రీతి గాంధీ ప్రశంసించారు.
అయితే జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా…. సీఎం పారికర్ అలాంటి స్థితిలో బయటకు రావడాన్ని తప్పుపట్టారు…. ‘ఎంత అమానుషం…. పూర్తిగా కోలుకోని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫొటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణం’ అంటూ ఓమర్ విమర్శించారు.
‘సీఎం ముక్కులో ట్యూబ్ ఉందా? పదవి దాహంతో ఉన్న బీజేపీ ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. ఇక మీ పార్టీ జిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.