Telugu Global
NEWS

కాట్రేని కోన వద్ద తీరం దాటిన ‘పెథాయ్’ తుపాన్

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న భారీ తుఫాన్ ‘పెథాయ్’ ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాట్రేని కోన వద్ద తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 80 కి.మీల వేగంతో తుపాన్ తీరం దాటింది. కాకినాడపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా వీస్తున్న గాలులకు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇంకా రెండు గంటలకు పైగా కాకినాడపై పెథాయ్ తుపాన్ భీభత్సం […]

కాట్రేని కోన వద్ద తీరం దాటిన ‘పెథాయ్’ తుపాన్
X

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న భారీ తుఫాన్ ‘పెథాయ్’ ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాట్రేని కోన వద్ద తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 80 కి.మీల వేగంతో తుపాన్ తీరం దాటింది. కాకినాడపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా వీస్తున్న గాలులకు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇంకా రెండు గంటలకు పైగా కాకినాడపై పెథాయ్ తుపాన్ భీభత్సం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తుపాన్ తీవ్రత కోస్తాంధ్ర తీరంలోని కృష్ణా, గుంటూరు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు ఏడు ఆంధ్రా జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు రోడ్ల మీదకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో నిన్న రాత్రి నుంచి ఎడతెగని వర్షం కురుస్తోంది.

తుపాన్ కారణంగా హైదరాబాద్, చెన్నై నుంచి ఉత్తరాధి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఒడిషా , బీహార్ వెళ్లే దాదాపు 50 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విమానాలను రద్దు చేశారు. తీరం వెంబడి ఉన్న దాదాపు 6వేల మంది తుపాన్ బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు.

తుపాన్ కారణంగా విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతింది. గ్రామాలు, పట్టణాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఫోన్స్ మూగబోయాయి. కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

First Published:  17 Dec 2018 11:20 AM IST
Next Story