రెండోసారి కొత్త పార్టీ పెట్టిన నటుడు కార్తీక్
తమిళనాడులో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది. సీనియర్ నటుడు, అలనాటి హీరో కార్తీక్ రెండోసారి కొత్త పార్టీని ప్రారంభించారు. తొలుత ”ఫార్వర్డ్ బ్లాక్” పార్టీలో చేరి తమిళనాడు అధ్యక్షుడిగా కార్తీక్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ”నాడాళుమ్ మక్కళ్ కట్చి” పేరుతో కొత్త పార్టీని నెలకొల్పారాయన. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన కార్తీక్ డిపాజిట్లు కోల్పోయారు. దాంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోసారి రాజకీయాల్లో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న కార్తీక్… ”కొత్త మనిద ఉరిమై […]
తమిళనాడులో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది. సీనియర్ నటుడు, అలనాటి హీరో కార్తీక్ రెండోసారి కొత్త పార్టీని ప్రారంభించారు. తొలుత ”ఫార్వర్డ్ బ్లాక్” పార్టీలో చేరి తమిళనాడు అధ్యక్షుడిగా కార్తీక్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ”నాడాళుమ్ మక్కళ్ కట్చి” పేరుతో కొత్త పార్టీని నెలకొల్పారాయన.
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన కార్తీక్ డిపాజిట్లు కోల్పోయారు. దాంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోసారి రాజకీయాల్లో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న కార్తీక్… ”కొత్త మనిద ఉరిమై కాక్కుం కట్చి” పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.
గతంలో తాను స్థాపించిన పార్టీలోని నాయకులే తనకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని కార్తీక్ విమర్శించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసి కొత్తగా మరో పేరుతో పార్టీ పెట్టినట్టు వివరించారు.