మీ ఊరికి వస్తా.... నీ కథ చూస్తా " మంత్రి ఆది వర్సెస్ రాచమల్లు
కడప జెడ్పీ సమావేశంలో మరోసారి వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు సవాళ్లు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యపై జరిగిన చర్చలో ఈ ఘటన జరిగింది. తనను నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి ఆది వార్నింగ్ ఇచ్చారు. మీ ఊరికి వస్తున్నా… మీ కథ చూస్తా… చూస్తూ ఉండు అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో […]

కడప జెడ్పీ సమావేశంలో మరోసారి వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు సవాళ్లు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యపై జరిగిన చర్చలో ఈ ఘటన జరిగింది.
తనను నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి ఆది వార్నింగ్ ఇచ్చారు. మీ ఊరికి వస్తున్నా… మీ కథ చూస్తా… చూస్తూ ఉండు అంటూ ఫైర్ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని… అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాకపోతే జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని…. ఒకవేళ టీడీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని మంత్రి ఆదినారాయణరెడ్డికి శివప్రసాద్ సవాల్ చేశారు.
సవాల్‌ను స్వీకరించేందుకు మంత్రి ఆది ముందుకు రాలేదు. శివప్రసాద్ రెడ్డి సవాల్‌తో ఆగ్రహించిన మంత్రి ఆది…. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.