చరిత్ర సృష్టించిన పీవీ సింధు....
పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ విజేతగా పీవీ సింధు నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై సింధు విజయం సాధించింది. రెండు వరుస సెట్లలో సింధు తన హవా కొనసాగించింది. 21-19, 21-17తో వరుస సెట్లతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. చరిత్ర సృష్టించిన విజయంతో గ్రాండ్‌గా సీజన్‌ను పీవీ సింధు ముగించింది. చైనాలోని గాంగ్జు వేదికగా జరుగుతున్న 2018 టోర్నీ…. గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన 6వ […]

పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ విజేతగా పీవీ సింధు నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై సింధు విజయం సాధించింది.
రెండు వరుస సెట్లలో సింధు తన హవా కొనసాగించింది. 21-19, 21-17తో వరుస సెట్లతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. చరిత్ర సృష్టించిన విజయంతో గ్రాండ్‌గా సీజన్‌ను పీవీ సింధు ముగించింది.
చైనాలోని గాంగ్జు వేదికగా జరుగుతున్న 2018 టోర్నీ…. గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన 6వ ర్యాంకర్ సింధు…. ప్రపంచ మాజీ చాంపియన్, 8వ ర్యాంకర్…. ఇంటానెన్ రచనోక్ తో శుక్రవారం జరిగిన పోరులో సింధు విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.