Telugu Global
National

ఫెథాయ్ ఎఫెక్ట్.... కొట్టుకొస్తున్న నౌకలు....

ఫెథాయ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. గంటకు 16 కి.మీల వేగంతో పెథాయ్ కదులుతోంది. మచిలీపట్నానికి దక్షిణ ఆజ్ఞయంగా 730 కి.మీలు.. చెన్నైకి తూర్పు ఆజ్ఞయంగా 530 కి.మీల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అన్ని ప్రధాన ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. రేపు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే తిత్లీ తుఫాన్ దాడిని […]

ఫెథాయ్ ఎఫెక్ట్.... కొట్టుకొస్తున్న నౌకలు....
X

ఫెథాయ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. గంటకు 16 కి.మీల వేగంతో పెథాయ్ కదులుతోంది. మచిలీపట్నానికి దక్షిణ ఆజ్ఞయంగా 730 కి.మీలు.. చెన్నైకి తూర్పు ఆజ్ఞయంగా 530 కి.మీల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.

అన్ని ప్రధాన ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

రేపు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే తిత్లీ తుఫాన్ దాడిని మరిచిపోకముందే ఇప్పుడు పెథాయ్ తుఫాన్ రావడం ఏపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది.

ప్రధానంగా ఈ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లాలో తీరందాటే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

పెథాయ్ తుఫాన్ దాటికి సముద్రంలో ఉన్న భారీ నౌకలు.. చిన్న నౌకలు కూడా తీరం వైపు కొట్టుకురావడం తుఫాన్ తీవ్రతను తెలియజేస్తోంది. కాకినాడ తీరానికి సమీపంలో సముద్రంలో లంగర్ వేసిన భారీ షిప్ లు తీరం వైపు కొట్టుకు వచ్చాయి.

తుఫాన్ దాటికి కాకినాడ తీరంలో సముద్రం 15 మీటర్ల ముందుకు వచ్చింది. అలలు 15 మీటర్ల పైకి ఎగిసి పడుతున్నాయి. తుఫాన్ ధాటికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. పంట కోసి ధాన్యాన్ని ఆరబోశారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేసి గౌడౌన్‌ లకు తరలించే పనుల్లో అధికారులున్నారు.

First Published:  16 Dec 2018 7:27 AM IST
Next Story