మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తారా?
అసెంబ్లీలో పుల్ మెజార్టీ వచ్చింది. గులాబీ పార్టీ తదుపరి వ్యూహాం ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. రాబోయే ఆరు నెలలు…. ఎన్నికలే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించడం ఇప్పుడు కేటీఆర్‌కి సవాల్‌గా మారింది. సర్పంచ్ ఎన్నికలు గెలవడం ముఖ్యం కాదు. ఎంపీ ఎన్నికలే కేటీఆర్‌కు అసలు సవాల్ విసిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎంపీ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై గులాబీ దళంలో కసరత్తు జరుగుతోంది. దాదాపు పాత ఎంపీలే […]
అసెంబ్లీలో పుల్ మెజార్టీ వచ్చింది. గులాబీ పార్టీ తదుపరి వ్యూహాం ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. రాబోయే ఆరు నెలలు…. ఎన్నికలే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించడం ఇప్పుడు కేటీఆర్‌కి సవాల్‌గా మారింది. సర్పంచ్ ఎన్నికలు గెలవడం ముఖ్యం కాదు. ఎంపీ ఎన్నికలే కేటీఆర్‌కు అసలు సవాల్ విసిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఎంపీ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై గులాబీ దళంలో కసరత్తు జరుగుతోంది. దాదాపు పాత ఎంపీలే పోటీ చేస్తారని అంటున్నారు .అయితే మెదక్ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు? అనేది ఓ హాట్ టాపిక్. ఇక్కడ నుంచి కేసీఆర్ లేదా హరీష్‌రావు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయనేది అంచనా. కరీంనగర్ లేదా నల్గొండ నుంచి కేసీఆర్ బరిలో ఉంటారనేది ఇంకో టాక్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే ఎంపీగా అడుగుపెట్టాలనేది కేసీఆర్ ఆలోచన.
టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎమ్మెల్యే, ఎంపీగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవికి రాజీనామా చేసేవారు. గత ఎన్నికల్లో కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా కేసీఆర్ పోటీ చేశారు. ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీఆర్ కూడా ఈసారి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆయన ఏ సీటు నుంచి పోటీ చేస్తారనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.