Telugu Global
NEWS

ఆ తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి....

కాంగ్రెస్ మళ్లీ అదే పొరపాటు చేస్తోంది. నేల విడిచి సాము చేస్తోంది. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఆ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఈ విషయం నిరూపితమైంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రజల నాడిని పసిగట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ అస్త్రశస్త్రాలు రెడీ చేసి ముందుకెళ్లారు. కానీ నాలుగేళ్లుగా ప్రజల్లో ఉండని కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో జట్టుకట్టి నానా హంగామా చేశారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ కే పట్టం కట్టారు. స్పష్టమైన […]

ఆ తరువాతే  పంచాయతీ ఎన్నికలు  నిర్వహించాలి....
X

కాంగ్రెస్ మళ్లీ అదే పొరపాటు చేస్తోంది. నేల విడిచి సాము చేస్తోంది. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఆ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఈ విషయం నిరూపితమైంది.

తెలంగాణ ఎన్నికల్లో ప్రజల నాడిని పసిగట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ అస్త్రశస్త్రాలు రెడీ చేసి ముందుకెళ్లారు. కానీ నాలుగేళ్లుగా ప్రజల్లో ఉండని కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో జట్టుకట్టి నానా హంగామా చేశారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ కే పట్టం కట్టారు. స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ కూటమి రాజకీయాలను, చంద్రబాబు తెలంగాణ పై పెత్తనాన్ని స్పష్టంగా వ్యతిరేకించారు.

ఈ నిజాన్ని గ్రహించని కాంగ్రెస్ పెద్దలు మరోసారి తప్పటడుగులు వేశారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా తాము ఓడిపోవడానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని ఆరోపించారు. టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని.. 20 లక్షల ఓట్లను గల్లంతు చేసిందని ఆరోపించారు. ప్రజలు ఓడించిన కారణాలను వెతక్కుండా కాంగ్రెస్ నేతలు ఇలా మీనమేషాలు లెక్కించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా మళ్లీ అదే పొరపాటు పునరావృతమైంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సహా కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఓట్లను టీఆర్ఎస్ చేర్చడం లేదని.. గల్లంతైన 20 లక్షల ఓట్లను తిరిగి చేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా స్పష్టమైన తీర్పునిచ్చినా దీన్ని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించకపోవడం గమనార్హం. ఇక్కడ కూడా వారు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ ఓట్ల గల్లంతును బూచీగా చూపడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

First Published:  16 Dec 2018 2:14 PM IST
Next Story