బాబుకు మీరైనా చెప్పండి... ఏపీ సీఎం పరువు తీసిన నిరుద్యోగి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఘోష రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఇటీవల చంద్రబాబు సభల్లో నినాదాలు చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు నినాదాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. వారిపై చంద్రబాబు ఉరమడమూ కామన్ అయిపోయింది. అయితే హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ సందర్భంగా ఒక నిరుద్యోగి వేడుకోలు అందరి దృష్టిని ఆకర్షించింది. చంద్రబాబుతో మంచి సంబంధాలున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక నిరుద్యోగి పైకి లేచి వెంకయ్య […]
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఘోష రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఇటీవల చంద్రబాబు సభల్లో నినాదాలు చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు నినాదాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. వారిపై చంద్రబాబు ఉరమడమూ కామన్ అయిపోయింది. అయితే హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ సందర్భంగా ఒక నిరుద్యోగి వేడుకోలు అందరి దృష్టిని ఆకర్షించింది.
చంద్రబాబుతో మంచి సంబంధాలున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక నిరుద్యోగి పైకి లేచి వెంకయ్య నాయుడును ఒక విషయం వేడుకున్నారు.
ఏళ్ల తరబడి గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న సదరు నిరుద్యోగి… ” అయ్యా… మీ చంద్రబాబుకు మీరైనా చెప్పండి. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పండి. మా నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకోండి. ఆయనకు( చంద్రబాబుకు) మీరైనా చెప్పండి సర్… నిరుద్యోగుల గురించి ఆలోచించమనండి” అంటూ నిరుద్యోగి వేడుకున్నారు. నిరుద్యోగి వేడుకోలు చూసిన వెంకయ్యనాయుడు సమాధానం చెప్పకుండా ముందుకెళ్లిపోయారు.