Telugu Global
NEWS

ఫిరాయింపుదారులను తరుముతున్న ఫరూక్‌

నంద్యాల టీడీపీలో మరోసారి రచ్చ మొదలైంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి ఫిరాయించినప్పటి నుంచి ఇక్కడ ఏదో ఒక రూపంలో వివాదాలు నడుస్తూనే వచ్చాయి. భూమా మరణం తర్వాత అఖిలప్రియ, నాగిరెడ్డి అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పదేపదే గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త తరహా ఆధిపత్యపోరు మొదలైంది. మంత్రి పదవి రాకముందు  సైలెంట్‌గా ఉంటూ వచ్చిన మంత్రి ఫరూక్‌… ఇప్పుడు తన దాడిని తీవ్రతరం చేశారు. భూమా కుటుంబాన్ని, అటు ఎస్పీవై రెడ్డి కుటుంబాలను […]

ఫిరాయింపుదారులను తరుముతున్న ఫరూక్‌
X

నంద్యాల టీడీపీలో మరోసారి రచ్చ మొదలైంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి ఫిరాయించినప్పటి నుంచి ఇక్కడ ఏదో ఒక రూపంలో వివాదాలు నడుస్తూనే వచ్చాయి. భూమా మరణం తర్వాత అఖిలప్రియ, నాగిరెడ్డి అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పదేపదే గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త తరహా ఆధిపత్యపోరు మొదలైంది. మంత్రి పదవి రాకముందు సైలెంట్‌గా ఉంటూ వచ్చిన మంత్రి ఫరూక్‌… ఇప్పుడు తన దాడిని తీవ్రతరం చేశారు.

భూమా కుటుంబాన్ని, అటు ఎస్పీవై రెడ్డి కుటుంబాలను నంద్యాల రాజకీయాల నుంచి తరిమే కార్యక్రమం పెట్టుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత నంద్యాలలో పోలీసులు మొత్తం ఫరూక్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవరూ లెక్క చేయడం లేదు.

మరో మంత్రి అఖిలప్రియ తన అన్నకు మద్దతుగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా… చంద్రబాబు వారించారు. నంద్యాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని అఖిలప్రియకు చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో భూమా బ్రహ్మానంద రెడ్డిని, ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని నంద్యాలలో చావు దెబ్బకొట్టేందుకు ఫరూక్‌ వేగంగా పావులు కదుపుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి ఫరూకే పోటీ చేస్తారన్న ప్రచారం మొదలుపెట్టారు. ఫరూక్ మంత్రి పదవి చేపట్టగానే వక్ఫ్ భూములను ఆక్రమించారంటూ భూమా అనుచరులుగా ఉన్న కౌన్సిలర్లను అరెస్ట్ కూడా చేయించారు. అయినప్పటికీ ఏమీ చేయలేకపోతున్నారు అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి.

ఫరూక్ తమను టార్గెట్ చేస్తున్న విషయాన్ని భూమా, ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. ఫరూక్‌ దూకుడు, ఆయనకు చంద్రబాబు అండగా ఉండడం చూసి వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో తమకు చెక్‌ ఖాయమని బ్రహ్మానందరెడ్డి, ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

First Published:  15 Dec 2018 3:50 PM IST
Next Story