Telugu Global
International

సింధును ఊరిస్తున్న ప్రపంచ టూర్ టైటిల్

సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఒకుహరాతో ఢీ సెమీఫైనల్లో రచనోక్ ఇంటానన్ పై 21-16, 25-23తో గెలుపు బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్…. ‘టైటిల్ ఫైట్ కు…. భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు అర్హత సంపాదించింది. చైనాలోని గాంగ్జు వేదికగా జరుగుతున్న 2018 టోర్నీ…. గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన 6వ ర్యాంకర్ సింధు…. చివరకు…. సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో సైతం దూకుడు కొనసాగించింది. ప్రపంచ మాజీ చాంపియన్, 8వ ర్యాంకర్…. ఇంటానెన్ రచనోక్ తో […]

సింధును ఊరిస్తున్న ప్రపంచ టూర్ టైటిల్
X
  • సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఒకుహరాతో ఢీ
  • సెమీఫైనల్లో రచనోక్ ఇంటానన్ పై 21-16, 25-23తో గెలుపు

బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్…. ‘టైటిల్ ఫైట్ కు…. భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు అర్హత సంపాదించింది. చైనాలోని గాంగ్జు వేదికగా జరుగుతున్న 2018 టోర్నీ…. గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన 6వ ర్యాంకర్ సింధు…. చివరకు…. సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో సైతం దూకుడు కొనసాగించింది.

ప్రపంచ మాజీ చాంపియన్, 8వ ర్యాంకర్…. ఇంటానెన్ రచనోక్ తో జరిగిన పోరులో సింధు వరుస గేమ్ ల విజయంతో తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. మొత్తం 54 నిముషాల పాటు సాగిన సమరంలో సింధు గట్టి పోటీ ఎదుర్కొని 21-16, 25-23తో రచనోక్ ను అధిగమించింది.

ఆదివారం జరిగే టైటిల్ సమరంలో జపాన్ ప్లేయర్ నజోమీ ఒకుహరాతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ లీగ్ లో ఇప్పటికే…. తొలిరౌండ్లో జపాన్ ప్లేయర్ యమగుచిని చిత్తు చేసిన సింధు…. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ తైజు యింగ్ పై మూడుగేమ్ ల విజయం సాధించింది.

14-21, 21-16, 21-18తో నెగ్గిన సింధుకు.. తాయ్ జు ప్రత్యర్థిగా ఇదే తొలిగెలుపు కావడం విశేషం. ఇప్పటి వరకూ సింధు- తాయ్ జు ఏడుసార్లు తలపడగా…సింధు 1-6 రికార్డుతో ఉంది. గ్రూప్ మూడోరౌండ్ పోటీలో అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్ ను వరుసగేమ్ ల్లో చిత్తు చేసిన సింధు…. టూర్ ఫైనల్స్ చేరడం ఇది వరుసగా రెండోసారి.

First Published:  15 Dec 2018 3:45 PM IST
Next Story