Telugu Global
NEWS

స్పీకర్‌ను ముందుపెట్టి.... సుప్రీం తీర్పుకు చంద్రబాబు ఎసరు

నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కడానికి వీల్లేదన్నట్టుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. తాజాగా మడకశిర టీడీపీ ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు ఆయన స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. కానీ వైసీపీ నేత ఎమ్మెల్యే అవడాన్ని చంద్రబాబు అంగీకరించడం లేదు. కొత్త వ్యూహానికి పదును పెట్టారు. ఎలాగో స్పీకర్‌ తన చేతుల్లోనే ఉంటారన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు తీర్పుకే విరుగుడు కనిపెట్టారు. మడకశిర […]

స్పీకర్‌ను ముందుపెట్టి.... సుప్రీం తీర్పుకు చంద్రబాబు ఎసరు
X

నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కడానికి వీల్లేదన్నట్టుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. తాజాగా మడకశిర టీడీపీ ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు ఆయన స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. కానీ వైసీపీ నేత ఎమ్మెల్యే అవడాన్ని చంద్రబాబు అంగీకరించడం లేదు. కొత్త వ్యూహానికి పదును పెట్టారు. ఎలాగో స్పీకర్‌ తన చేతుల్లోనే ఉంటారన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు తీర్పుకే విరుగుడు కనిపెట్టారు.

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఆ క్షణమే ఆయన ఎన్నిక రద్దు అయింది. కాకపోతే చంద్రబాబు అండ్‌ టీం వ్యూహాత్మకంగా ఈరన్న చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించింది. రాజీనామా లేఖను ఈరన్న అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఇచ్చి వెళ్లిపోయారు. స్పీకర్‌ రాజీనామాను ఆమోదించే వరకు ఈరన్న ఎమ్మెల్యేగా కొనసాగుతారని అధికారులు చెబుతున్నారు.

సుప్రీం తీర్పుతో తక్షణం రద్దయిన ఎమ్మెల్యే పదవికి…. ఈరన్న రాజీనామా చేయడం వెనుక మరో మూడు నాలుగు నెలలు వ్యవహారాన్ని ఇలాగే సాగదీసే కుట్ర ఉందని చెబుతున్నారు. ఈరన్న సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటే ఆ క్షణమే పదవి రద్దు అయి ఆ స్థానంలో వైసీపీ నేత తిప్పేస్వామి వస్తారు. కానీ రాజీనామా చేసి స్పీకర్‌ చేతిలో రాజీనామా లేఖను పెట్టడం ద్వారా ఈరన్న చట్టవిరుద్దంగానైనా పదవిలో కొనసాగే వెసులుబాటు కల్పించారు.

ఒకవేళ ఈరన్న పదవి తక్షణం రద్దు అయింది కాబట్టి రాజీనామా చేసే అధికారం కూడా లేదని వైసీపీ నేతలు కోర్టుకు వెళ్తే ఆ అంశం తేలడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ లోపు మూడు నాలుగు నెలలు గడిస్తే ప్రస్తుత శాసనసభ పదవీకాలమే ముగిసిపోతుంది. ఇదీ చంద్రబాబు అండ్ టీం స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని వేసిన ప్లాన్.

First Published:  15 Dec 2018 4:23 AM IST
Next Story