Telugu Global
NEWS

ఫేస్‌బుక్‌పై మరో భారీ దాడి

ఫేస్‌బుక్‌ మరోసారి దాడికి గురైంది. 68 లక్షల మంది యూజర్ల డేటా చోరీకి గురైంది. ఈసారి యూజర్ల ఫొటోలు టార్గెట్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌పై ఇటీవల దాడి జరగడం ఇది మూడో సారి. ఎఫ్‌బీ యూజర్ల సమాచారం లీక్‌ అయినట్టు స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది. బగ్‌ ద్వారా డేటా చోరీ జరిగినట్టు ఆ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్‌లో దాదాపు 12 రోజుల పాటు ఈ డేటా చోరీ అయినట్టు భావిస్తున్నట్టు వెల్లడించింది. దాదాపు 15వందల థర్డ్‌ పార్టీ […]

ఫేస్‌బుక్‌పై మరో భారీ దాడి
X

ఫేస్‌బుక్‌ మరోసారి దాడికి గురైంది. 68 లక్షల మంది యూజర్ల డేటా చోరీకి గురైంది. ఈసారి యూజర్ల ఫొటోలు టార్గెట్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌పై ఇటీవల దాడి జరగడం ఇది మూడో సారి. ఎఫ్‌బీ యూజర్ల సమాచారం లీక్‌ అయినట్టు స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది.

బగ్‌ ద్వారా డేటా చోరీ జరిగినట్టు ఆ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్‌లో దాదాపు 12 రోజుల పాటు ఈ డేటా చోరీ అయినట్టు భావిస్తున్నట్టు వెల్లడించింది. దాదాపు 15వందల థర్డ్‌ పార్టీ యాప్స్‌లో ఉన్న ఒక బగ్‌ ద్వారా ఈ దాడి జరిగినట్టు వివరించింది. యూజర్లకు తెలియకుండానే ఫోన్‌లోని వ్యక్తిగత ఫోటోలు ఎఫ్‌బీలోకి అప్‌లోడ్‌ అయ్యాయని వెల్లడించింది.

సమస్యను పరిష్కరించామని జరిగిన దానికి క్షమించాల్సిందిగా ఫేస్‌బుక్ తన యూజర్లను విజ్ఞప్తి చేసింది. థర్డ్‌ పార్టీ యాప్స్‌లోకి ఫేస్‌బుక్ వివరాలతో లాగిన్ అవడం వల్ల ఈ సమస్య వచ్చి ఉంటుందని ఎఫ్‌బీ టీం అభిప్రాయపడింది.

First Published:  15 Dec 2018 11:25 AM IST
Next Story