Telugu Global
NEWS

టీ అసెంబ్లీలో ముగ్గురు ఐదో తరగతి... అత్యధికులు విద్యాధికులే...

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి అత్యధికులు ఉన్నత విద్యను అభ్యసించిన వారే. గతంలో కంటే ఈసారి ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువగా సభకు ఎన్నికయ్యారు. పోస్టు గ్రాడ్యుయేట్‌, ఇతర ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య గతంలో కంటే 37 శాతం పెరిగింది. టీఆర్‌ఎస్‌కు చెందిన 88 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు డాక్టర్లు, 24 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన వారిలో ఐదుగురు ఇంజనీరింగ్ చదివిన వారు, తొమ్మిది మంది లా […]

టీ అసెంబ్లీలో ముగ్గురు ఐదో తరగతి... అత్యధికులు విద్యాధికులే...
X

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి అత్యధికులు ఉన్నత విద్యను అభ్యసించిన వారే. గతంలో కంటే ఈసారి ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువగా సభకు ఎన్నికయ్యారు. పోస్టు గ్రాడ్యుయేట్‌, ఇతర ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య గతంలో కంటే 37 శాతం పెరిగింది.

టీఆర్‌ఎస్‌కు చెందిన 88 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు డాక్టర్లు, 24 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన వారిలో ఐదుగురు ఇంజనీరింగ్ చదివిన వారు, తొమ్మిది మంది లా పూర్తి చేసిన వారు ఉన్నారు.

జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్‌ కుమార్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచిన రాజయ్య, జడ్చర్ల నుంచి గెలిచిన లక్ష్మారెడ్డి లు టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్లు.

కొత్తగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ముగ్గురు సభ్యులు ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు. ఎనిమిదో తరగతి పాస్ అయిన వారు ఇద్దరున్నారు. పది పాస్ అయిన వారు 23 మంది, ఇంటర్‌ వరకు చదివిన వారు 23 మంది, డిగ్రీ చదివిన వారు 25 మంది ఉన్నారు. వయసు రిత్యా చూస్తే 51 నుంచి 61 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యేల సంఖ్య అత్యధికంగా 50గా ఉంది. 61 ఏళ్లు దాటిన వారి సంఖ్య 26…. 71 ఏళ్లు దాటిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుగా ఉంది.

ఈసారి సభలో 33 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ బానోతు యంగెస్ట్‌ ఎమ్మెల్యే, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వయసు కూడా అంతే. స్వీడన్‌లో బీటెక్ పూర్తి చేసిన రోహిత్ రెడ్డి తాండూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

First Published:  14 Dec 2018 6:34 AM IST
Next Story