Telugu Global
NEWS

బావ చేతిలో మోసపోయానంటున్న తారా చౌదరి... పోలీసులకు ఫిర్యాదు

తారా చౌదరి మరోసారి వార్తల్లోకి వచ్చింది. మోసపోయానంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తన బావ మోసం చేసి ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారామె. తారా చౌదరి చాలాకాలంగా హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. 2016లో బావ వరుస అయ్యే రాజ్‌కుమార్… తారా చౌదరి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని కోరాడు. అప్పటికే రాజ్‌కుమార్‌కు పెళ్లి అయింది. భార్య ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటావని తారా చౌదరి ప్రశ్నించింది. […]

బావ చేతిలో మోసపోయానంటున్న తారా చౌదరి... పోలీసులకు ఫిర్యాదు
X

తారా చౌదరి మరోసారి వార్తల్లోకి వచ్చింది. మోసపోయానంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తన బావ మోసం చేసి ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారామె. తారా చౌదరి చాలాకాలంగా హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది.

2016లో బావ వరుస అయ్యే రాజ్‌కుమార్… తారా చౌదరి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని కోరాడు. అప్పటికే రాజ్‌కుమార్‌కు పెళ్లి అయింది. భార్య ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటావని తారా చౌదరి ప్రశ్నించింది. దీంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. విడాకుల వ్యవహారం నడుస్తుండగానే తారాచౌదరి, రాజ్‌కుమార్ శ్రీనగర్‌ కాలనీలో సహజీవనం మొదలుపెట్టారు.

చాలాకాలం పాటు ఇద్దరి సహజీవనం సజావుగానే సాగింది. బయటకు వెళ్లినా ఒకరినొకరు భార్యభర్తలుగా పరిచయం చేసుకునేవారు. అయితే కొద్దిరోజులుగా రాజ్‌కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదులో వివరించారు. ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ ఆస్తులు అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా తనను వేధిస్తున్నాడని రాజ్‌కుమార్‌పై తారా చౌదరి ఫిర్యాదు చేసింది. తారా చౌదరి ఫిర్యాదు మేరకు రాజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో తారా చౌదరి ఎపిసోడ్‌ తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకులను హడలెత్తించింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఆమె గతంలో తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేసింది.

First Published:  14 Dec 2018 6:10 AM IST
Next Story