Telugu Global
NEWS

నేను ముందే చెప్పా.... కొంప మునుగుతుందని

కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని తాను ముందే హెచ్చరించానని చెప్పారు. టీడీపీతో పొత్తే కాంగ్రెస్ కొంప ముంచిందన్నారు. టీడీపీతో పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు…. తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో…. సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడంవల్లే ఓడిపోయినట్లు చెప్పారు. పొత్తు కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర నాయకత్వాన్ని […]

నేను ముందే చెప్పా.... కొంప మునుగుతుందని
X

కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని తాను ముందే హెచ్చరించానని చెప్పారు.

టీడీపీతో పొత్తే కాంగ్రెస్ కొంప ముంచిందన్నారు. టీడీపీతో పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు…. తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో…. సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడంవల్లే ఓడిపోయినట్లు చెప్పారు.

పొత్తు కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుబట్టారు. దీనిపై అధిష్ఠానానికి ఓ నివేదిక ఇవ్వనున్నట్లు రాములమ్మ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

First Published:  13 Dec 2018 3:00 AM IST
Next Story