Telugu Global
NEWS

మేం టీఆర్ఎస్ లో చేరడం లేదు

కేసీఆర్ ఈ మధ్యాహ్నం 1.25 గంటలకు ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో…. అలా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లు కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు గులాబీ పార్టీ ఆకర్ష్ కు ఖమ్మం జిల్లా కకావికలం కాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా కారు జోరుగా సాగినా ఖమ్మంలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మంలో తప్పితే కారు గెలువలేకపోయింది. దీంతో ఆ జిల్లా […]

మేం టీఆర్ఎస్ లో చేరడం లేదు
X

కేసీఆర్ ఈ మధ్యాహ్నం 1.25 గంటలకు ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో…. అలా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లు కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు గులాబీ పార్టీ ఆకర్ష్ కు ఖమ్మం జిల్లా కకావికలం కాబోతున్నట్టు సమాచారం.

తెలంగాణ వ్యాప్తంగా కారు జోరుగా సాగినా ఖమ్మంలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మంలో తప్పితే కారు గెలువలేకపోయింది. దీంతో ఆ జిల్లా నుంచి మంత్రి పదవి ఇచ్చేందుకు ఖమ్మం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే మిగిలాడు.. కేసీఆర్ ఆయనకే మంత్రిగా ఇస్తాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

గత సారి మంత్రి ఈసారి పాలేరు నుంచి ఓడిపోయిన తుమ్మలకు మంత్రి పదవి లేదని స్పష్టం చేసిన కేసీఆర్ తాజాగా ఖమ్మం జిల్లాపై ఫుల్ ఫోకస్ చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి కూటమి తరుఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కాగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కూడా టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. మహేశ్వరంలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, తాండూర్ లో గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలొచ్చాయి.

దీనిపై తాజాగా సబితా ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం స్పందించారు. ‘తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహజనితమని.. అస్సలు కాంగ్రెస్ ను వీడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదు’ అని సబిత విలేకరులకు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలు ఈసారి ఓటమి చవిచూశారు. దీంతో అస్సలు కాంగ్రెస్ కు అసెంబ్లీలో బలంగా వాణి వినిపించే నేతలే లేరు. ఇప్పుడు ఉన్న నేతలు కూడా గులాబీ గూటికి చేరితే ఆపార్టీకి కష్టకాలమే మరి.

First Published:  13 Dec 2018 10:53 AM IST
Next Story