తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చేది లేదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్ పునాదులే కదిలిపోయాయి. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కురువృద్ధులు సైతం మట్టి కరిచారు. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. టీడీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలవగా వారిద్దరూ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 90కి చేరింది. ఈ బలం మరింత పెరిగేలా ఉంది. గురువారం కొందరు ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కొన్ని […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్ పునాదులే కదిలిపోయాయి. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కురువృద్ధులు సైతం మట్టి కరిచారు. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. టీడీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది.
ఇద్దరు ఇండిపెండెంట్లు గెలవగా వారిద్దరూ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 90కి చేరింది. ఈ బలం మరింత పెరిగేలా ఉంది. గురువారం కొందరు ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ వివరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన స్పీకర్ మధుసూదనాచారి, తుమ్మల లాంటివారికి కేబినెట్‌లో స్థానం కల్పిస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా…. అలాంటిదేమీ ఉండదని కేసీఆర్ చెప్పారు.
ఓడిపోయిన వారిని కేబినెట్‌లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నిజానికి 2014లో కూడా తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. కానీ టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి గెలిచిన తుమ్మల… ఈసారి కూడా ఓడిపోయారు.
ఓడిపోగానే తుమ్మలకు కేసీఆర్ ఫోన్ చేసి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. దీంతో ఓడినా సరే తుమ్మలను కేసీఆర్ మరోసారి మంత్రిగా అందలం ఎక్కిస్తారని భావించారు. కానీ అలాంటి అవకాశం లేదని కేసీఆర్ తేల్చేశారు.
నిజానికి తాను 90కిపైగా స్థానాలు వస్తాయని అంచనా వేశానని… కానీ ఖమ్మం జిల్లాలో సొంత పార్టీ నేతలు చేసిన తప్పుల వల్లే తన అంచనా కొద్దిగా తప్పిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 90 నుంచి 106 స్థానాల మధ్యలో వస్తాయనుకుంటే ఆ సంఖ్య 88 వద్ద ఆగిపోయిందన్నారు కేసీఆర్.