Telugu Global
NEWS

అందుకే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన పరిణామాలను వివరించారు. టీఆర్‌ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కొందరు సీనియర్ పాత్రికేయుల వద్ద కేసీఆర్ ముచ్చటించారు. గతంలో జరిగిన పరిణామాలను వివరించారు. 2014లో కాంగ్రెస్‌ తనను అవమానించిందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తాను అంగీకరించానని చెప్పారు. అందుకు గాను పీసీసీ చీఫ్‌గా నియమించాల్సిందిగా కోరానన్నారు. తన ప్రతిపాదన విన్న తర్వాత ఒకసారి దిగ్విజయ్‌ సింగ్‌ను […]

అందుకే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన పరిణామాలను వివరించారు. టీఆర్‌ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కొందరు సీనియర్ పాత్రికేయుల వద్ద కేసీఆర్ ముచ్చటించారు. గతంలో జరిగిన పరిణామాలను వివరించారు.

2014లో కాంగ్రెస్‌ తనను అవమానించిందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తాను అంగీకరించానని చెప్పారు.

అందుకు గాను పీసీసీ చీఫ్‌గా నియమించాల్సిందిగా కోరానన్నారు. తన ప్రతిపాదన విన్న తర్వాత ఒకసారి దిగ్విజయ్‌ సింగ్‌ను కలవాల్సిందిగా సోనియా గాంధీ సూచించారన్నారు.

తాను దిగ్విజయ్‌ సింగ్‌ వద్దకు వెళ్లి పీసీసీ చీఫ్ నియామకం గురించి ప్రస్తావించగా అవమానకరంగా మాట్లాడారన్నారు. పీసీసీ చీఫ్‌గా నియమక ప్రతిపాదనను తిరస్కరించారన్నారు.

దాంతో తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించానని కేసీఆర్‌ వివరించారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకపోవడంతో విజయశాంతి లాంటి నేతలను కాంగ్రెస్‌ నేతలు వారి పార్టీలోకి చేర్చుకున్నారని చెప్పారు.

First Published:  13 Dec 2018 5:20 AM IST
Next Story