Telugu Global
NEWS

ఐపీఎల్ " 12 వేలంలో భలేమాంచి చౌక భేరమూ....

 346 మంది క్రికెటర్లతో వేలం తుది జాబితా కనీస స్థాయిలోనే భారత క్రికెటర్ల వేలం ధర జోధ్ పూర్ వేదికగా డిసెంబర్ 18న ఐపీఎల్ వేలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ వేలం హంగామాకు…. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత 11 సీజన్లుగా ముంబై లేదా బెంగళూరు నగరాలకే పరిమితమైన ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని ఈసారి… పశ్చిమ భారత నగరం జోధ్ పూర్ వేదికగా తొలిసారిగా నిర్వహించబోతున్నారు. 2019 సీజన్ […]

ఐపీఎల్  12 వేలంలో భలేమాంచి చౌక భేరమూ....
X
  • 346 మంది క్రికెటర్లతో వేలం తుది జాబితా
  • కనీస స్థాయిలోనే భారత క్రికెటర్ల వేలం ధర
  • జోధ్ పూర్ వేదికగా డిసెంబర్ 18న ఐపీఎల్ వేలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ వేలం హంగామాకు…. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత 11 సీజన్లుగా ముంబై లేదా బెంగళూరు నగరాలకే పరిమితమైన ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని ఈసారి… పశ్చిమ భారత నగరం జోధ్ పూర్ వేదికగా తొలిసారిగా నిర్వహించబోతున్నారు.

2019 సీజన్ కోసం మొత్తం 346 మంది క్రికెటర్ల తో తుదిజాబితాను సిద్ధం చేశారు. ఇందులో 226 మంది భారత క్రికెటర్లు సైతం ఉన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్ వెల్ మాత్రం…. ప్రస్తుత సీజన్ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు.

భలే మాంచి చౌకభేరమూ….

ఐపీఎల్ గత 11 సీజన్ల వేలంతో పోల్చిచూస్తే…ప్రస్తుత 12వ సీజన్ వేలంలో మాత్రం స్టార్ ప్లేయర్ల ధర దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు 14 కోట్ల రూపాయల రికార్డు ధర అందుకొన్న సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్… కనీస వేలం ధర ప్రస్తుత సీజన్లో కోటిరూపాయలకు పడిపోవడం విశేషం.

గత సీజన్ వేలంలో రికార్డు ధర దక్కించుకొన్న యువఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్… ప్రస్తుత వేలంలో అత్యధికంగా కోటీ 50 లక్షల రూపాయల కనీస వేలం ధరతో మాత్రమే ఉన్నాడు.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా, లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లాంటి క్రికెటర్లు సైతం… కోటి రూపాయల కనీస వేలం ధరతోనే… వేలం బరిలోకి దిగనున్నారు.

2కోట్ల కనీస వేలం ధరతో….

రెండుకోట్ల రూపాయల కనీస వేలం ధరతో మొత్తం తొమ్మిది మంది విదేశీ క్రికెటర్లను వేలానికి ఉంచారు. వీరిలో శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, లాసిత్ మలింగ, కోలిన్ ఇంగ్రామ్, బ్రెండన్ మెకల్లమ్, కోరీ యాండర్సన్, క్రిస్ వోక్స్, శామ్యూల్ కరెన్, షాన్ మార్ష్, డీ ఆర్కే షార్ట్ ఉన్నారు.

గత పదిసీజన్లుగా ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన రిచర్డ్ మాడ్లే…ప్రస్తుత 12వ సీజన్ వేలానికి దూరం కానున్నాడు. బీసీసీఐ నుంచి తనకు ఆహ్వానం అందలేదని మాడ్లే ట్వీట్ చేయడం విశేషం.

ఈ వేలం కార్యక్రమంలో …మొత్తం ఫ్రాంచైజీలు తమ నిపుణుల బృందాలతో వేలం యుద్ధానికి సిధ్దమయ్యాయి.

First Published:  13 Dec 2018 8:50 AM IST
Next Story