Telugu Global
NEWS

తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మందిలో 67 మంది నేర చరితులే..!

తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా నేర చరితులే అని… వీరిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు గత అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తేల్చింది. వీళ్లందరి మీద సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను అఫిడవిట్‌లో పొందు పరచడమే కాకుండా టీవీ, పత్రికల్లో […]

తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మందిలో 67 మంది నేర చరితులే..!
X

తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా నేర చరితులే అని… వీరిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు గత అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తేల్చింది. వీళ్లందరి మీద సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను అఫిడవిట్‌లో పొందు పరచడమే కాకుండా టీవీ, పత్రికల్లో తాము చేసిన నేరాలపై ప్రకటన చేయాలని నిబంధన విధించారు. అయితే వీరెవరూ మీడియా ద్వారా ఓటర్లకు తమ నేర చరితకు సంబంధించిన సమాచారం చెప్పలేదని పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ తరపున ఎన్నికైన 88 మందిలో 44 మందిపై, బీజేపీ నుంచి ఎన్నికైన రాజా సింగ్‌పై ఎన్నో కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. కూటమి నుంచి ఎన్నికైన 21 మందిలో 16 మందిపై, ఎంఐఎం తరపున ఎన్నికైన ఏడుగురిలో ఆరుగురిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు.

First Published:  13 Dec 2018 1:12 AM GMT
Next Story