Telugu Global
NEWS

హైటెక్‌ సిటీని తెచ్చింది నేదురుమల్లి.... భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు

ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎస్ అజయ్‌ కల్లం డిమాండ్ చేశారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం… అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రం సబ్సిడీలు ఇస్తోందని విమర్శించారు. సరదాగా విదేశాలకు తిరిగే వారికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. ఇండిగో విమాన సంస్థ విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానం తిప్పేందుకు 18 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తూ జీవో […]

హైటెక్‌ సిటీని తెచ్చింది నేదురుమల్లి.... భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు
X

ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎస్ అజయ్‌ కల్లం డిమాండ్ చేశారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం… అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రం సబ్సిడీలు ఇస్తోందని విమర్శించారు.

సరదాగా విదేశాలకు తిరిగే వారికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. ఇండిగో విమాన సంస్థ విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానం తిప్పేందుకు 18 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తూ జీవో ఇచ్చిందన్నారు. ఒక ప్రైవేట్‌ సంస్థ విమానాలు తిప్పుతుంటే డబ్బులు ఇచ్చి నడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందన్నారు.

విహారయాత్రకు వెళ్లే పెద్దల కోసం 18 కోట్లు ఇవ్వడం ప్రజల కోసం పాలన ఎలా అవుతుందని అజయ్ కల్లం ప్రశ్నించారు. ఒక నిరుద్యోగి పరీక్ష రాసేందుకు మరో పట్టణానికి వెళ్తే ఆ యువకుడి పరిస్థితి గురించి మాత్రం ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.

ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి దీక్షలు చేయడం చరిత్రలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. తెలంగాణలో పక్కా ఇళ్లు చదరపు అడుగుకు 800 రూపాయలు చెల్లిస్తుంటే… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 1900 నుంచి 2200 రూపాయలను ప్రైవేట్‌ కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లిస్తున్నారని వివరించారు.

ఇలాంటి వాటిపై ఎవరైనా ప్రశ్నిస్తే హేళన చేయడం అలవాటైపోయిందన్నారు. లగ్జరీకి ఏమాత్రం నాయకులు అలవాటు పడకూడదని మహాత్మ గాంధీ చెప్పారన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ముఖ్యమంత్రే తన లగ్జరీ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆవేదన చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 1991లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆరు ఐటీ ఎస్‌ ఈ జెడ్‌ లను ఏర్పాటు చేస్తే అందులో ఒకటి హైదరాబాద్ లోని మైత్రివనంలో వచ్చిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కంపెనీలకు అక్కడ స్థలం సరిపోకపోవడంతో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి… 10 ఎకరాల భూమి, నాలుగున్నర కోట్ల డబ్బు కేటాయించారన్నారు. హైటెక్‌ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డే స్వయంగా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీని ప్రారంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు మాత్రం చుట్టూ భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అజయ్ కల్లం వివరించారు. హైటెక్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు ఇప్పుడు అంతా తామే కట్టామని చెప్పుకుంటున్నారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

దానికి మీడియా కూడా వంతపాడిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినడానికి ఇదో కారణమన్నారు. మీడియా అసత్య ప్రచారం కారణంగానే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు.

ఒక చానల్‌ పెట్టాలంటే 50 కోట్లు ఖర్చు అవుతుందని… కానీ అసత్యాలు ప్రచారం చేయించుకునేందుకు ప్రభుత్వం ఒక్కో టీవీ చానల్‌కు వందల కోట్లు ప్రభుత్వ డబ్బు అప్పగిస్తోందని వివరించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను సర్వనాశనం చేసి చైతన్య, నారాయణ కాలేజీలను బతికిస్తున్నారని విమర్శించారు.

First Published:  13 Dec 2018 8:54 AM IST
Next Story