Telugu Global
NEWS

విదేశీ టెస్ట్ సిరీస్ ల్లో విరాట్ కొహ్లీ తీన్మార్....

టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీ అరుదైన రికార్డు ఏ ఆసియా కెప్టెన్ కూ లేని గౌరవం దక్కించుకొన్న కొహ్లీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలలో కొహ్లీకి టెస్ట్ విజయాలు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఆసియా దేశాలకు చెందిన ఏ కెప్టెన్ కు దక్కని రికార్డు… అడిలైడ్ టెస్ట్ విజయంతో… విరాట్ కొహ్లీకి దక్కింది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలిటెస్ట్ […]

విదేశీ టెస్ట్ సిరీస్ ల్లో విరాట్ కొహ్లీ తీన్మార్....
X
  • టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీ అరుదైన రికార్డు
  • ఏ ఆసియా కెప్టెన్ కూ లేని గౌరవం దక్కించుకొన్న కొహ్లీ
  • ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలలో కొహ్లీకి టెస్ట్ విజయాలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఆసియా దేశాలకు చెందిన ఏ కెప్టెన్ కు దక్కని రికార్డు… అడిలైడ్ టెస్ట్ విజయంతో… విరాట్ కొహ్లీకి దక్కింది.

నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలిటెస్ట్ ఆఖరి రోజు ఆటలో…టీమిండియా 31 పరుగులతో విజయం సాధించడంతోనే… విజయవంతమైన కెప్టెన్ గా కొహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది.

గత భారత కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్రసింగ్ ధోనీలకు దక్కని గౌరవం కొహ్లీకి సొంతమయ్యింది.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల గడ్డపై టీమిండియాకు టెస్ట్ విజయాలు అందించిన తొలి కెప్టెన్ గా విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించాడు. 2008 సిరీస్ లో భాగంగా పెర్త్ వాకా స్టేడియంలో ముగిసిన టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత… కంగారూ గడ్డపై ఇదే తొలి గెలుపు కావడం విశేషం.

ఒకే ఒక్కడు కొహ్లీ….

ధోనీ కెప్టెన్ గా 2009లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే కాదు… ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలలో టెస్ట్ విజయాలు చవి చూశాడు. అయితే…. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్ ల్లో కనీసం ఒక్క విజయమూ సాధించలేకపోయాడు.

రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో సైతం టీమిండియా… ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలలో టెస్ట్ విజయాలు నమోదు చేసినా… ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క గెలుపు చవిచూడ లేకపోయింది.

అయితే… సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలలో జరిగిన సిరీస్ ల్లో… కెప్టెన్ గా కనీసం ఒక్కో టెస్ట్ విజయం సాధించిన ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకోగలిగాడు.

10 ఏళ్ల తర్వాత తొలిగెలుపు….

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా కంగారూ గడ్డపై గత పదేళ్ల లో టీమిండియాకు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. తన కెరియర్ లో 75వ టెస్ట్ మ్యాచ్ ఆడిన కొహ్లీ… వ్యక్తిగతంగా… ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా మరో రికార్డు సాధించాడు.

2004 సిరీస్ లో కొహ్లీ టాప్….

2014 ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కొహ్లీ… ఏకంగా 692 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 86.50 సగటు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా…. విరాట్ కొహ్లీ ఆడిన ఎనిమిది టెస్టుల్లో 992 పరుగులతో… 62.00 సగటు సాధించాడు. ఐదు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సైతం ఆస్ట్రేలియాపైన కొహ్లీకి సాధించిన రికార్డు ఉంది.

అయితే… ప్రస్తుత సిరీస్ తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులు మాత్రమే సాధించి అవుటయ్యాడు. అడిలైడ్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోనూ స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమైన కొహ్లీ… కెప్టెన్ గా మాత్రం చిరస్మరణీయ విజయం అందుకొన్నాడు.

ప్రస్తుత అడిలైడ్ టెస్ట్ వరకూ కొహ్లీ…. ఇప్పటి వరకూ ఆడిన 75 మ్యాచ్ ల్లో 6వేల 368 పరుగులతో… 53 సగటు నమోదు చేశాడు.

పెర్త్ వేదికగా డిసెంబర్ 14 నుంచి జరిగే రెండోటెస్ట్ లో మూడంకెల స్కోరు సాధించాలన్న పట్టుదలతో కొహ్లీ ఉన్నాడు.

కంగారూ గడ్డపై ఆరో గెలుపు….

1947 సిరీస్ నుంచి ప్రస్తుత 2018 సిరీస్ వరకూ… ఆస్ట్రేలియా గడ్డపై 45 టెస్టులు ఆడిన టీమిండియాకు… ఇది కేవలం ఆరో విజయం మాత్రమే.

గత 70 సంవత్సరాల కాలంలో టీమిండియా…. ఒక్కసారీ సిరీస్ నెగ్గలేకపోయింది. గత ఏడు దశాబ్దాల కాలంలో 11 సిరీస్ ల్లో భాగంగా ఆడిన 44 టెస్టుల్లో టీమిండియాకు ఐదంటే ఐదు విజయాలు మాత్రమే ఉండటం విశేషం.

ఓవరాల్ గా టీమిండియా-ఆసీస్ జట్లు 25 సిరీస్ ల్లో తలపడితే … ఆస్ట్రేలియా 12 విజయాలు, టీమిండియా 8 సిరీస్ విజయాలు సాధించగా… ఐదు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. మొత్తం 69 టెస్టుల్లో ఈ రెండుజట్లు ఢీ కొంటే… ఆస్ట్రేలియా 41 విజయాలు, టీమిండియా 27 విజయాలు సాధించాయి.

First Published:  11 Dec 2018 7:10 AM IST
Next Story