Telugu Global
NEWS

ఓటమిపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ పనిచేసుకుపోతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే మంచి పాలన అందించేవారమన్నారు. ఓడిపోయినా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ… ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతామన్నారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అన్నది కాంగ్రెస్‌లో లేదన్నారు. కేసీఆర్ ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఇచ్చిన లైసెన్స్‌గా భావించకుండా… బాధ్యతగా […]

ఓటమిపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ పనిచేసుకుపోతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే మంచి పాలన అందించేవారమన్నారు. ఓడిపోయినా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ… ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతామన్నారు.

గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అన్నది కాంగ్రెస్‌లో లేదన్నారు. కేసీఆర్ ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఇచ్చిన లైసెన్స్‌గా భావించకుండా… బాధ్యతగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని సూచించారు.

గతంలో ఉన్న వ్యవహారశైలిని వదిలేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఫాంహౌజ్‌ నుంచి పాలనను సచివాలయానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటమికి చంద్రబాబే కారణమా అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం దాటవేశారు. సరైన సమాచారం లేకుండా తాను ఏదీ మాట్లాడబోనన్నారు.

First Published:  11 Dec 2018 7:13 AM IST
Next Story