అక్కడ వీవీ ప్యాట్ స్లిప్పులు కూడా లెక్కిస్తాం.... సీఈవో రజత్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై ఒంటి గంట కల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 ఎన్నికల కౌంటింగ్ సెంటర్లలో 119 నియోజకవర్గాల లెక్కింపు జరుగుతుందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. […]
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై ఒంటి గంట కల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 ఎన్నికల కౌంటింగ్ సెంటర్లలో 119 నియోజకవర్గాల లెక్కింపు జరుగుతుందన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. అత్యల్పంగా బెల్లంపల్లిలో 15 రౌండ్ల కౌంటింగ్.. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎం ఓటింగ్ లెక్కిస్తామన్నారు. అన్ని చోట్ల వీవీ ప్యాట్లను లెక్కించడం కుదరదని.. కేవలం అత్యవసరం అనుకున్న చోట మాత్రమే వీవీ ప్యాట్లు లెక్కిస్తామనన్నారు.
ప్రతీ రౌండు అభ్యుర్థులకు చూపించే ఫలితం ప్రకటిస్తామని.. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ పూర్తి చేస్తామని.. లైవ్ రిపోర్టింగ్‌ను కూడా అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.