కాబోయే తొలి మహిళా మంత్రి ఈమేనా....?
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన తొలి దఫా పాలనలో ఎదుర్కున్న అతి పెద్ద విమర్శల్లో ఒకటి మహిళకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదని. మేనిఫెస్టోలో పెట్టిన, పెట్టని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ చెప్పుకున్నా.. ఈ కేబినెట్లో మహిళా మంత్రి లేరు అనే విమర్శ మాత్రం ఆయనను గత నాలుగున్నరేండ్లు వెంటాడింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోటును ఈ సారి భర్తీ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ స్థానం కోసం సరైన […]
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన తొలి దఫా పాలనలో ఎదుర్కున్న అతి పెద్ద విమర్శల్లో ఒకటి మహిళకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదని. మేనిఫెస్టోలో పెట్టిన, పెట్టని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ చెప్పుకున్నా.. ఈ కేబినెట్లో మహిళా మంత్రి లేరు అనే విమర్శ మాత్రం ఆయనను గత నాలుగున్నరేండ్లు వెంటాడింది.
గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోటును ఈ సారి భర్తీ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ స్థానం కోసం సరైన అభ్యర్థిని కూడా వెతికి పెట్టారని.. ఆమైతేనే ఉన్నత పదవికి అర్హురాలనే వాదన వినిపిస్తోంది.
స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో.. ఆ సీటులో ఎవరిని కూర్చోబెట్టాలనే చర్చ మొదలైంది. మరో వైపు డిప్యుటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నుంచి విజయం సాధించారు. గత ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే ఆమెను బుజ్జగించి డిప్యుటీ స్పీకర్‌ను చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ‘పద్మా దేవేందర్ రెడ్డి నా పెద్ద కూతురు లాంటిది’ అని చెప్పారు. గెలిస్తే పెద్ద పదవి వస్తుందని హామీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా లేదా స్పీకర్ పదవి కట్టబెడతారా అనే విషయంపై చర్చ నడుస్తోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో మరో ఐదేండ్లు ఉండటానికి కూడా పద్మా దేవేందర్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది మరో విషయం.
ఒక వేళ ఆమె స్పీకర్ పదవి కాదంటే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రి అనే ఘనత కూడా ఆమె సొంతం కానుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.