చంద్రబాబు వీడియోలున్నాయి.... విజయవాడకు వెళ్లే చెబుతా....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్… చంద్రబాబుకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి తనకు గిఫ్ట్ ఇచ్చారని…. తాను కూడా చంద్రబాబుకు తిరిగి గిఫ్ట్ ఇస్తానన్నారు. తిరిగి గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారని…. తాను కూడా అదే కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జోక్యం చేసుకుంటామన్నారు. ఏపీ రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవాలంటూ లక్షలాదిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. చంద్రబాబు […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్… చంద్రబాబుకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి తనకు గిఫ్ట్ ఇచ్చారని…. తాను కూడా చంద్రబాబుకు తిరిగి గిఫ్ట్ ఇస్తానన్నారు. తిరిగి గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారని…. తాను కూడా అదే కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జోక్యం చేసుకుంటామన్నారు.
ఏపీ రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవాలంటూ లక్షలాదిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేసినప్పుడు తామెందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లకూడదని కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా అని ప్రశ్నించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబుకు పైత్యం చాలా ఉందన్నారు. తొలుత మోడీ చంకలో చేరి క్యాష్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నీతి ఆయోగ్‌లో చంద్రబాబు ఏం మాట్లాడారు?… ఎలా నవ్వులపాలయ్యారు అన్నది రేపు చెబుతానన్నారు.
అఖిలేష్ యాదవ్ తదితరులు ఉన్న ఒక మీటింగ్‌లో నరేంద్రమోడీని పొడిగేందుకు చంద్రబాబు అత్యుత్సాహం చూపి… దేశంలో మొదటి సారి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాని అయ్యారంటూ పొడిగారన్నారు. దాంతో మీటింగ్‌లో ఉన్న వారంతా గొల్లున నవ్వారన్నారు. పీవీ నర్సింహారావు, చరణ్ సింగ్, మోరార్జిదేశాయ్ తదితరులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానులు కాలేదా అంటూ అఖిలేష్ యాదవ్ తదితరులు గట్టిగా నవ్వారన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడారు అన్న దానిపై కొన్ని వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఆ వీడియోలను విజయవాడకే వెళ్లి ప్రదర్శించి ప్రజలకు వివరిస్తానన్నారు. చంద్రబాబు గురించి ప్రజలకు చెప్పకుండా ఉండే ప్రసక్తే లేదన్నారు.