Telugu Global
NEWS

ఏపీ ప్రజలకు బాబు నుంచి విముక్తి కలగాలని ఆశిస్తున్నా....

కూటమి కట్టి తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. కూటమి కట్టి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ఏపీలో ఫెయిల్ అయిన చంద్రబాబునాయుడు ఆ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు తెలంగాణకు వచ్చి కూటమి కట్టి ఇక్కడ గెలిస్తే దాన్ని చూపించి తిరిగి ఏపీలో పుంజుకోవాలని చూశారన్నారు. కేసీఆర్‌ పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పాలన చేశారు. అందుకే గ్రేటర్ పరిధిలోనూ టీఆర్‌ఎస్ దూసుకెళ్లిందన్నారు. జీవన్ […]

ఏపీ ప్రజలకు బాబు నుంచి విముక్తి కలగాలని ఆశిస్తున్నా....
X

కూటమి కట్టి తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. కూటమి కట్టి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు.

ఏపీలో ఫెయిల్ అయిన చంద్రబాబునాయుడు ఆ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు తెలంగాణకు వచ్చి కూటమి కట్టి ఇక్కడ గెలిస్తే దాన్ని చూపించి తిరిగి ఏపీలో పుంజుకోవాలని చూశారన్నారు.

కేసీఆర్‌ పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పాలన చేశారు. అందుకే గ్రేటర్ పరిధిలోనూ టీఆర్‌ఎస్ దూసుకెళ్లిందన్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు ఉన్నచోట కూడా టీఆర్‌ఎస్‌కు 50వేల మెజారిటీ రావడం అంటే అది కేసీఆర్‌పై నమ్మకమేనన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పటికైనా చంద్రబాబును నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చూసి అలాంటి కార్యకర్తలు ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబును నిలదీయాలన్నారు. చంద్రబాబు ఎన్ని మాయలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

మూల సిద్ధాంతం మరిచి కాంగ్రెస్‌తో కలిసిన చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇదే రిజల్ట్ ఏపీలోనూ రిపీట్ అవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు కూడా చంద్రబాబు నుంచి విముక్తులు కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కవిత చెప్పారు.

First Published:  11 Dec 2018 12:50 AM GMT
Next Story