తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన తొలి అభ్యర్థి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతోంది. జిల్లాలకు జిల్లాలను స్వీప్ చేస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉందనుకున్న దక్షణ తెలంగాణలో, సెటిలర్లంతా టీడీపీతోనే ఉంటారని ప్రచారం చేసుకున్న గ్రేటర్ ఫరిధిలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు చిత్తవుతున్నారు. కూకట్ పల్లిలో కూడా టీడీపీ వెనుకబడిపోయింది. 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ అధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి 15 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. హేమాహేమీలు మట్టి కరిచేలా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం చాంద్రాయణగుట్ట నుంచి వెలువడింది. ఇక్కడ […]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతోంది. జిల్లాలకు జిల్లాలను స్వీప్ చేస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉందనుకున్న దక్షణ తెలంగాణలో, సెటిలర్లంతా టీడీపీతోనే ఉంటారని ప్రచారం చేసుకున్న గ్రేటర్ ఫరిధిలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు చిత్తవుతున్నారు. కూకట్ పల్లిలో కూడా టీడీపీ వెనుకబడిపోయింది.
90 స్థానాల్లో టీఆర్‌ఎస్ అధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి 15 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. హేమాహేమీలు మట్టి కరిచేలా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం చాంద్రాయణగుట్ట నుంచి వెలువడింది. ఇక్కడ ఎంఐఎం తరపున పోటీ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు.