రాజీనామా చేసిన ఆర్‌బీఐ గవర్నర్
మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా ఆర్‌బీఐలో రగులుతున్న వివాదం ఆర్‌బీఐ గవర్నర్ పోస్టుకు ఎసరు తెచ్చేసింది. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. ఈ క్షణం నుంచే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తనకు ఇంతకాలం సహకరించిన ఉద్యోగులకు, సహచరులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేసినట్టు పటేల్ వెల్లడించారు. గత కొంతకాలంగా ఉర్జీత్ పటేల్‌కు, కేంద్రానికి మధ్య కోర్డ్ వార్ నడుస్తోంది. ఆర్‌బీఐలో […]
మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా ఆర్‌బీఐలో రగులుతున్న వివాదం ఆర్‌బీఐ గవర్నర్ పోస్టుకు ఎసరు తెచ్చేసింది. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. ఈ క్షణం నుంచే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
తనకు ఇంతకాలం సహకరించిన ఉద్యోగులకు, సహచరులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేసినట్టు పటేల్ వెల్లడించారు.
గత కొంతకాలంగా ఉర్జీత్ పటేల్‌కు, కేంద్రానికి మధ్య కోర్డ్ వార్ నడుస్తోంది. ఆర్‌బీఐలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఆర్ బీఐ అధికారాలన్నింటిని కేంద్రం లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి.