ఎదురీదుతున్న నల్లగొండ సీఎం అభ్యర్థులు
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఈసారి ఎదురీదుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డ జిల్లా ప్రజానీకం ఈసారి మాత్రం కాంగ్రెస్ పెద్దలకే చుక్కలు చూపిస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నది కేవలం అంచనా అయినప్పటికీ… ఓటింగ్ జరిగిన సరళి సీఎం అభ్యర్థులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ బడానేతలు కూడా ఈసారి సొంత నియోజకవర్గాల్లో ఎదురీదుతున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించారు కాబోలు ముఖ్యమంత్రి అభ్యర్థులు అయినప్పటికీ తమ నియోజకవర్గాలను దాటి ప్రచారానికి రాలేకపోయారు. జానారెడ్డి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బయట ఎక్కడా […]
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఈసారి ఎదురీదుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డ జిల్లా ప్రజానీకం ఈసారి మాత్రం కాంగ్రెస్ పెద్దలకే చుక్కలు చూపిస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నది కేవలం అంచనా అయినప్పటికీ… ఓటింగ్ జరిగిన సరళి సీఎం అభ్యర్థులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ బడానేతలు కూడా ఈసారి సొంత నియోజకవర్గాల్లో ఎదురీదుతున్నారు.
ఈ పరిస్థితిని ముందే ఊహించారు కాబోలు ముఖ్యమంత్రి అభ్యర్థులు అయినప్పటికీ తమ నియోజకవర్గాలను దాటి ప్రచారానికి రాలేకపోయారు. జానారెడ్డి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బయట ఎక్కడా కనిపించలేదు. సొంత నియోజక వర్గంలో పనిచేసుకుంటూ వెళ్లారు. అయినప్పటికీ ఆయన గెలుస్తారని ఈసారి ధీమాగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. పోలింగ్‌కు ముందు రోజు జానారెడ్డి తన బలాన్ని ఉపయోగించినా పరిస్థితి అనుకున్నంత స్థాయిలో టర్న్ అవలేదంటున్నారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడలో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కోదాడలో చంద్రబాబు బహిరంగ సభ వల్ల మంచి జరక్కపోగా పరిస్థితి ఎదురుతిరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైదిరెడ్డిని టీఆర్‌ఎస్ బరిలో దింపడంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెడ్డి ఓటింగ్ ఈసారి ఏకపక్షంగా ఉత్తమ్ ఖాతాలో పడలేదు. పైగా రెండు మండలాల్లో ఉత్తమ్‌కుమార్ కు గతంలో ఏకపక్షంగా ఓటింగ్ వచ్చినా ఈసారి ఆ రెండు మండలాల్లో పరిస్థితి 50-50గా మారింది. ఉత్తమ్ గెలిచినా, ఓడినా ఐదు వేల ఓట్లకు అటుఇటుగా ఉండవచ్చని భావిస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో మాత్రం పరిస్థితి సానుకూలంగా ఉందన్న అంచనాలు వస్తున్నాయి. మనుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుతో పాటు మెజారిటీ పైనా లెక్కలేసుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి విజయం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా… నల్లగొండ అర్బన్ ఓటింగ్ ఎటు టర్న్ అయిందన్న దానిపై అంచనాకు రాలేకపోతున్నారు. ఏదీ ఏమైనా నల్లగొండలోని సీఎం అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు ఈసారి గట్టి పోటీనే ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది.