Telugu Global
NEWS

ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్లో భారత్

గ్రూప్-సీ టాపర్ గా భారత్ ఆఖరి రౌండ్లో కెనడాపై 5-1 గోల్స్ తో భారత్ గెలుపు 13 న భారత్ క్వార్టర్ ఫైనల్స్ సమరం ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్, ఆతిథ్య భారత్ దూసుకెళ్లింది. గ్రూప్ – సీ లీగ్ టాపర్ గా… నేరు గా క్వార్టర్స్ బెర్త్ సంపాదించింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ ఆఖరిరౌండ్ పోటీలో భారత్ 5-1 గోల్స్ తో కెనడాను చిత్తు చేసింది. ఆట […]

ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్లో భారత్
X
  • గ్రూప్-సీ టాపర్ గా భారత్
  • ఆఖరి రౌండ్లో కెనడాపై 5-1 గోల్స్ తో భారత్ గెలుపు
  • 13 న భారత్ క్వార్టర్ ఫైనల్స్ సమరం

ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్, ఆతిథ్య భారత్ దూసుకెళ్లింది. గ్రూప్ – సీ లీగ్ టాపర్ గా… నేరు గా క్వార్టర్స్ బెర్త్ సంపాదించింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ ఆఖరిరౌండ్ పోటీలో భారత్ 5-1 గోల్స్ తో కెనడాను చిత్తు చేసింది.

ఆట మొదటి రెండు క్వార్టర్లలో… రెండుజట్లు చెరో గోల్ సాధించి 1-1తో సమఉజ్జీగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగియటం ఖాయమన్న పరిస్థితి వచ్చింది. అయితే ఆఖరి క్వార్టర్ లో భారత ఆటగాళ్లు చెలరేగి ఆడి…గోల్ వెంట గోల్ సాధిస్తూ…. తమజట్టుకు నాలుగు గోల్స్ అందించడం ద్వారా…. 5-1 గోల్స్ విజయం పూర్తి చేశారు.

గ్రూప్ తొలిరౌండ్లో… సౌతాఫ్రికాను 5-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్…. రెండోరౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను 2-2 గోల్స్ తో నిలువరించింది.

అయితే…. భారత్, బెల్జియం జట్లు రెండూ చెరో ఏడు పాయింట్లు చొప్పున సాధించి సమ ఉజ్జీలుగా నిలిచినా…. గోల్స్ సగటున భారత్ గ్రూప్ టాపర్ స్థానం సంపాదించింది. ఈనెల 13న జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడాల్సి ఉంది.

భారత్ తర్వాతి స్థానంలో బెల్జియం…

ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ కు మూడో ర్యాంకర్ బెల్జియం సైతం చేరుకొంది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-సీ..ఆఖరి రౌండ్ పోటీలో బెల్జియం 5-0 గోల్స్ తో సౌతాఫ్రికాను చిత్తు చేసి… గ్రూపు రన్నరప్ గా నిలిచింది.

భారత్ తో జరిగిన మ్యాచ్ ను 2-2తో డ్రాగా ముగించిన బెల్జియం…కెనడాతో తొలిరౌండ్ పోటీలో 2-1 గోల్స్ తో గట్టెక్కి….ఏడుపాయింట్లతో భారత్ తో సమఉజ్జీగా నిలిచింది. అయితే …సాధించిన గోల్స్ సగటున భారత జట్టే గ్రూప్ టాపర్ స్థానాన్ని చేజిక్కించుకోగలిగింది.

గ్రూప్- సీ నుంచి 5వ ర్యాంకర్ భారత్, 3 వ ర్యాంకర్ బెల్జియం క్వార్టర్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి. సౌతాఫ్రికా, కెనడా జట్లు… లీగ్ దశ నుంచే నిష్క్రమించక తప్పలేదు.

First Published:  10 Dec 2018 12:25 PM IST
Next Story