Telugu Global
NEWS

ఈవీఎంల ట్ర‌బుల్స్‌తో నేత‌ల‌కు గుబుల్ ! 

తెలంగాణ ఎన్నిక‌ల్లో పోలింగ్ బూత్ ట్రబుల్స్ ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు కొత్త గుబులు రేపుతోంది. గ్రామాల వారీగా పోలింగ్‌పై నేత‌లు ఆరాతీస్తుంటే కార్య‌క‌ర్త‌లు చెబుతున్న వివ‌రాల‌తో ఆందోళ‌న చెందుతున్నారు. చ‌తుర్ముఖ‌, ముక్కోణ‌పు పోటీతో పాటు వ‌న్ టు వ‌న్ ఫైట్ ఉన్న చోట వంద ఓట్లు కూడా కీల‌కం. కాని పోలింగ్ రోజు జ‌రిగిన ఎర్ర‌ర్స్ ఇప్పుడు నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ తీసుకొస్తున్నాయి. 1. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను చీక‌ట్లో పెట్టారు. వీవీ ప్యాట్‌ల‌పై లైట్ ఎక్కువ‌గా పడొద్దు. […]

ఈవీఎంల ట్ర‌బుల్స్‌తో నేత‌ల‌కు గుబుల్ ! 
X

తెలంగాణ ఎన్నిక‌ల్లో పోలింగ్ బూత్ ట్రబుల్స్ ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు కొత్త గుబులు రేపుతోంది. గ్రామాల వారీగా పోలింగ్‌పై నేత‌లు ఆరాతీస్తుంటే కార్య‌క‌ర్త‌లు చెబుతున్న వివ‌రాల‌తో ఆందోళ‌న చెందుతున్నారు. చ‌తుర్ముఖ‌, ముక్కోణ‌పు పోటీతో పాటు వ‌న్ టు వ‌న్ ఫైట్ ఉన్న చోట వంద ఓట్లు కూడా కీల‌కం. కాని పోలింగ్ రోజు జ‌రిగిన ఎర్ర‌ర్స్ ఇప్పుడు నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ తీసుకొస్తున్నాయి.

1. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను చీక‌ట్లో పెట్టారు. వీవీ ప్యాట్‌ల‌పై లైట్ ఎక్కువ‌గా పడొద్దు. ప‌డితే వాటిలో సెన్స‌ర్ ప‌నిచేయ‌దు. దీంతో పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు లేకుండా సిబ్బంది జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఓటు వేసిన విష‌యం బ‌య‌ట నుంచి చూస్తార‌ని గ‌దుల కిటీకీలు కూడా మూసివేశారు. దీంతో ఈవీఎంలో ఉన్న‌గుర్తులు వృద్ధుల‌కు క‌నిపించ‌కుండా పోయాయి. చాలా మంది గుర్తులు వెతుక్కుని వేయాల్సిన ప‌రిస్థితి కొన్ని కేంద్రాల్లో ఎదురైంది.

ముసలివాళ్ల‌లో చాలా మంది పైన ఉన్న బ‌ట‌న్స్‌ని నొక్కి వ‌చ్చారు. ఈవీఎం ద‌గ్గ‌రికి పోలింగ్ సిబ్బంది వెళ్లొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో సిబ్బంది అక్క‌డి కి వెళ్ల‌కుండా…మీకు న‌చ్చిన బ‌ట‌న్ నొక్క‌మ‌ని చెప్పారు. దీంతో వృద్ధులు పైన ఉన్న నెంబ‌ర్స్ నొక్కి వ‌చ్చారు. ఇప్పుడు ట‌ఫ్ పైట్ ఉన్న చోట ఈ ఓట్లు ఎవ‌రి ఫేట్ మారుస్తాయో తెలియ‌దు.

కొన్ని పార్టీలకు ట్రక్ గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్. ఈ గుర్తుకు కారు గుర్తుకు దగ్గర పోలికలు ఉండడంతో టీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు కొన్ని ట్రక్ గుర్తు మీద పడ్డాయని లబోదిబోమంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు.

2. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. దీంతో రెండు నుంచి మూడు ఈవీఎంలు పెట్ట‌డం జ‌రిగింది. క‌రీంన‌గ‌ర్‌లో 26 మంది అభ్య‌ర్థులు రంగంలో ఉన్నారు. దీంతో రెండు ఈవీఎంలు పెట్టారు. కొంత‌మంది వృద్ధులు,మ‌హిళ‌ల‌కు ఈవీఎంలో త‌మ పార్టీ నెంబ‌ర్ ఎంతో కార్య‌క‌ర్త‌లు చెప్పి పంపారు. తీరా ఈవీఎంల ద‌గ్గ‌ర‌కి వెళ్ళడంతో రెండు ఉండ‌డంతో రైట్ సైడ్ ఉన్న ఈవీఎంల్లో నెంబ‌ర్ నొక్కారు. ఈ ఓట్లు స్వ‌తంత్రుల‌కు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఈ ఓట్లు ఎవ‌రి త‌ల‌రాత మారుస్తాయో తెలియ‌దు.

3. పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా కొంద‌రు నేత‌లు వెనుక‌బ‌డిన‌ట్లు సమాచారం అందుతోంది. చివ‌రి రెండు రోజుల్లో కార్య‌క‌ర్త‌లు స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు టెన్ష‌న్ మొద‌లైంది. చివ‌రి నిమిషంలో ప్ర‌లోభాలు త‌మ‌కు ఎస‌రు తీసుకొస్తాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు.

4. ప్ర‌చార ఖ‌ర్చు పెరిగిపోవ‌డంతో కూడా అభ్య‌ర్థుల‌కు ద‌డ మొద‌లైంది. ఇప్పుడు లెక్క‌లు పూర్తిగా రావ‌డంతో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో అనుకున్న‌దానికంటే ఖ‌ర్చు విప‌రీతంగా పెరిగింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ప్ర‌చార ఖ‌ర్చు 15 కోట్ల‌కు పైగానే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

First Published:  10 Dec 2018 2:29 AM IST
Next Story