Telugu Global
NEWS

ఆ వార్తల్లో నిజం లేదు....

తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఖండించారు. తాను టీడీపీ వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ మారుతున్నట్టు కొన్ని టీవీ చానళ్లలో వార్తలొచ్చాయని.. అందుకే వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఇందుకు స్పందించిన అవంతి… తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు జరిగిన ప్రచారం కుట్రపూరితమన్నారు. రాజకీయంగా టీడీపీని బలహీనపరిచేందుకు కొందరు […]

ఆ వార్తల్లో నిజం లేదు....
X

తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఖండించారు. తాను టీడీపీ వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

పార్టీ మారుతున్నట్టు కొన్ని టీవీ చానళ్లలో వార్తలొచ్చాయని.. అందుకే వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది.

ఇందుకు స్పందించిన అవంతి… తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు జరిగిన ప్రచారం కుట్రపూరితమన్నారు. రాజకీయంగా టీడీపీని బలహీనపరిచేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

First Published:  10 Dec 2018 3:47 AM IST
Next Story